Allu Aravind : అఖిల్, చైతూ కెరీర్ కోసం రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. భారీ ప్లాన్..!
NQ Staff - May 31, 2023 / 01:06 PM IST

Allu Aravind : అక్కినేని హీరోలకు పెద్దగా కలిసి రావట్లేదు. చైతూ, అఖిల్ ఇంకా స్టార్ హీరోలు కాలేకపోతున్నారు. బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా వీరిద్దరిలో ఒక్కరు కూడా స్టార్ హీరోలు కాదు కదా.. కనీసం టైర్-2 హీరోలుగా కూడా నిరూపించుకోలేక పోతున్నారు. ఇంకా చెప్పాలంటే వరుసగా ప్లాప్స్ తో సతమతం అవుతున్నారు.
అఖిల్ కెరీర్ లో ఇప్పటి వరకు ఒకే ఒక్క హిట్టు పడింది. చైతూ సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కెరీర్ కోసం అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతోనే అఖిల్ కు మొదటి హిట్ లభించింది.
దాంతో ఇప్పుడు చైతూ కోసం కూడా రంగంలోకి దిగబోతున్నాడు అల్లు అరవింద్. ఇప్పుడు చైతూ కోసం ఆయన ఓ మంచి స్క్రిప్ట్ ను రెడీ చేయిస్తున్నాడంట. నిఖిల్ తో కార్తికేయ సిరీస్ ను తీసిన చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమాను సెట్ చేశాడంట అల్లు అరవింద్.
గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా వస్తుందంటే కచ్చితంగా హిట్ గ్యారెంటీ అని అందరికీ తెలిసిందే. మంచి క్వాలిటీతోనే సినిమాలు చేస్తుంటారు. అందుకే ఇప్పుడు చైతూకు హిట్ గ్యారెంటీ అని చెబుతున్నారు నెటిజన్లు. ఇలా అక్కినేని హీరోల కెరీర్ కోసం అల్లు అరవింద్ మంచి ప్లాన్ చేస్తున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.