Alliance with Jana Sena is loss for TBJP : జనసేనతో పొత్తులు టీబీజేపీకి నష్టమే.. ఆ మాత్రం అర్థం కావట్లేదా..?

NQ Staff - October 25, 2023 / 02:44 PM IST

Alliance with Jana Sena is loss for TBJP : జనసేనతో పొత్తులు టీబీజేపీకి నష్టమే.. ఆ మాత్రం అర్థం కావట్లేదా..?

Alliance with Jana Sena is loss for TBJP : తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే బీఆర్ ఎస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించేసి సమరశంశాన్ని పూరించింది. దమ్ముంటే మా అభ్యర్థులను ఢీకొట్టండి అని సవాల్ విసురుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇంకా ఓపిక పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఇప్పటి వరకు మొదటి లిస్టును మాత్రమే ప్రకటించాయి. కానీ రెండో లిస్టుకు ఇంకా సమయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కూడా జనసేనతో పొత్తుల కోసం ఆరాట పడుతోంది. జనసేన పార్టీ తరఫున 32 మంది అభ్యర్థులను మొదటగా ప్రకటించారు.

తెలంగాణలో ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉన్న చోటనే సీట్లను ప్రకటించింది జనసేన పార్టీ. కానీ ఏమైందో తెలియదు వెంటనే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వెళ్లి పవన్ కల్యాణ్‌ తో చర్చలు జరిపారు. జనసేనతో పొత్తుల కోసం వారు ఆరాటపడుతున్నారు. అందుకే జనసేన ప్రకటించిన అభ్యర్థులను వెనక్కు తీసుకోవాలని కోరారు. దానికి పవన్ కల్యాణ్‌ కూడా ఒప్పుకున్నాడు. అమిత్ షాతో ఈ నెల 27న భేటీ కాబోతున్నారు. పొత్తుల్లో భాగంగా జనసేన, బీజేపీ నడుమ సీట్ల పంపిణీపై చర్చించబోతున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది

ఇక్కడే బీజేపీ ఒక విషయాన్ని మర్చిపోయినట్టుంది. మిగతా రాష్ట్రాల ఎన్నికలు వేరు.. తెలంగాణ ఎన్నికలు వేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది ప్రతి ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపుతోంది. ఆంధ్రా నుంచి విడిపోయిన తెలంగాణలో ఆంధ్రా పార్టీతో పొత్తులు పెట్టుకుంటే అది ఆ పార్టీకి తీవ్రమైన నష్టమే మిగులుస్తుంది. గత ఎన్నికల్లో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకుంది. చంద్రబాబు వచ్చి తెలంగాణలో ప్రచారం చేశాడు. దాంతో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ తెరమీదకు తెచ్చారు. దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. బీఆర్ ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది.

ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా ఇంతే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పవన్ కల్యాణ్‌ అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు పవన్ కల్యాణ్‌ తో పొత్తులు పెట్టుకుంటే బీజేపీ తెలంగాణ వ్యతిరేకి అని బీఆర్ ఎస్ పార్టీ ప్రచారం చేసుకోవడానికి వీలు ఏర్పడుతుంది.

అది అంతిమంగా బీజేపీకి నష్టం చేకూరుస్తుంది. బీజేపీ పార్టీ ఆంధ్రా నేతలతో కొమ్ముకాస్తోంది అని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తే గనక అది తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ వ్యతిరేకులతో బీజేపీ పొత్తులు రాష్ట్రానికి నష్టం.. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్‌ పర్మిషన్ తో ఇక్కడ పాలన సాగిస్తారు అంటూ బీఆర్ ఎస్ ప్రచారం చేసుకోవడానికి వీలు కల్పించినట్టు అవుతుంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us