Allari Naresh Participated An Interview : అల్లరి నరేష్ కు వార్ణింగ్ ఇచ్చిన స్టార్ నటుడు.. సినిమాలు తీస్తే నీ పని చెప్తానంటూ..
NQ Staff - July 29, 2023 / 07:54 PM IST

Allari Naresh Participated An Interview :
అల్లరి నరేష్ అంటే తెలియని వారు లేరు.. ఇవివి సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన తండ్రి పేరు చెప్పుకోకుండా తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.. ఇక అల్లరి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత వరుస సినిమాలను చేసి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచు కున్నాడు.
ఈయన కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచాడు.. ఒక హీరో యాక్షన్ కానీ మాస్ హీరోగా కానీ పేరు తెచ్చుకోవడం ఈజీ.. కానీ కామెడీ హీరోగా నిలదొక్కుకోవడం కాస్త.. కానీ అల్లరి నరేష్ వరుసగా కామెడీ సినిమాలనే చేసి ప్రేక్షకుల్లో గుర్తుండి పోయే నటుడిగా పేరు తెచ్చుకున్నాడు..
అయితే ఈ టాలీవుడ్ హీరోను ఒక స్టార్ నటుడు సినిమాలు చేయొద్దని వార్ణింగ్ ఇచ్చారట.. అందుకు కారణం ఏంటంటే.. అల్లరి నరేష్ తన సినిమాల్లో స్టార్ హీరోలను ఇమిటేట్ చేస్తారు అనే విషయం విదితమే.. అయితే మొదట్లో ఆ సినిమాలు బాగానే అలరించాయి కానీ రాను రాను ఈ సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టేశాయి..

Allari Naresh Participated An Interview
మరి ఇలాంటి సినిమాలపై ఆర్ నారాయణమూర్తి అల్లరి నరేష్ కు వార్ణింగ్ ఇచ్చారట. అల్లరి నరేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగ అప్పుడు ఆర్ నారాయణమూర్తి కాల్ చేసి నీ సినిమాలు బాగుంటాయి కానీ వేరే హీరోలు తమ సినిమాల్లో చేసే సన్నివేశాలను మీ సినిమాల్లో చేయడం ఆపేయండి చూసేవాళ్లకు చెత్తలా ఉన్నాయంటూ సీరియస్ గా చెప్పారట.. అప్పటి నుండి అల్లరి నరేష్ అలాంటి సినిమాలు చేయడం మానేశారని చెబుతున్నారు.