అల్లు అర్జున్ ఆల్ టైం రికార్డ్

Advertisement

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా హిట్ అయ్యి ఫిలిం నగర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ ఏడాది సంక్రాంత్రి కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. అయితే అల వైకుంఠపురంలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ద్వారా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. గత ఆదివారం రోజున ప్రసారం అయిన ఈ చిత్రం 29.4 టీఆర్పీ రేటింగ్ లో ఆల్ టైం రికార్డు సృష్టించింది. అయితే ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లో సరిలేరు నీకెవ్వరు చిత్రం కొనసాగింది.

ఇక ఈ చిత్ర రికార్డు అల వైకుంఠపురంలో మూవీ సొంతం చేసుకుంది. కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రసారం అయింది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా 23.4 టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు టాలీవుడ్ లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్న టాప్ 5 సినిమాలలో అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, భాహుబలి 2, బాహుబలి మరియు డీజే చిత్రాలు నిలిచాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here