ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకున్న సినిమా హీరోలు

Admin - July 20, 2020 / 09:56 AM IST

ఎనబై ఎనమిది ఏళ్ళ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ మరియు మరెన్నో సూపర్ హిట్స్ దాంట్లో కొన్ని మాత్రం ఇండస్ట్రీ హిట్స్. ఇక ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు కదా.. ఇంతకు ముందు ఉన్న రికార్డు లను తుడిచివేసి కొత్త చరిత్ర ను సృష్టించడం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హిట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎన్ని హిట్స్ కొట్టారో ఒకసారి తెలుసుకుందాం.

మొదటగా మన టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి తారకరామారావు విషయానికి వస్తే అన్న ఎన్టీఆర్ గారు నటించి నటువంటి మాయాబజార్, పాతాళ భైరవి, లవకుశ మరియు అడవి రాముడు వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.

ఇక రెండవ నటుడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర్రావు గారు. నాగేశ్వర్ రావు గారు నటించిన కీలుగుఱ్ఱం, బాలరాజు, దేవదాసు, మాయాబజార్, రోజులు మారాయి, దసరా బుల్లోడు మరియు ప్రేమాభిషేకం సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు.

మూడో నటుడు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారు తన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన దైన పేరును సంపాదించుకున్నాడు. ఇక మెగాస్టార్ నటించిన సినిమాలలో ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు మరియు ఇంద్ర వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.

నాలుగో నటుడు నటసింహం నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన ముద్దుల మావయ్య, సమరసింహా రెడ్డి మరియు నరసింహ నాయుడు వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.

ఐదో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన నటనతో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించున్నాడు పవన్. ఇక పవర్ స్టార్ నటించినటువంటి ఖుషి మరియు అత్తారింటికి దారేది సినిమాలు ఇండస్ట్రీ హిట్టులుగా నిలిచాయి.

ఆరో నటుడువిక్టరీ వెంకటేష్. వెంకటేష్ నటించినటువంటి చంటి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఏడవ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ నటించినటువంటి మగధీర సినిమా ఇండస్ట్రీ హిట్టు గా నిలిచింది. అలాగే బాక్స్ ఆఫీస్ లో కలక్షన్ల పర్వం కూడా కురిపించింది.

ఇక ఎనిమిదో నటుడు మోహన్ బాబు. మోహన్ బాబు నటించినటువంటి పెద్దరాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

తొమ్మిదో నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరును తీసుకొచ్చాయి. తాను నటించినటువంటి బాహుబలి బిగినింగ్ మరియు బాహుబలి కంక్లూషన్ సినిమాలు టాలీవుడ్ లో రికార్డులు బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్టులు గా నిలిచాయి.

పదవ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక మహేష్ బాబు నటించినటువంటి పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us