BRS : కాంగ్రెస్ ను నమ్మని మైనార్టీలు.. బీఆర్ ఎస్ వైపే ముస్లిం ఓటర్లు..!

NQ Staff - November 4, 2023 / 03:11 PM IST

BRS : కాంగ్రెస్ ను నమ్మని మైనార్టీలు.. బీఆర్ ఎస్ వైపే ముస్లిం ఓటర్లు..!

BRS :

కాంగ్రెస్ పార్టీకి ఓ పేరుంది. అదే దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ. అన్ని మతాలకు అనుకూలంగా ఉంటుందని అంటుంటారు. అయితే దేశంలో ఇది ఎలా ఉందో తెలియదు గానీ.. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం ఇది దారుణంగా ఉంది. అసలు సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ ను తెలంగాణలో ఎవరూ పెద్దగా నమ్మట్లేదు. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు మాత్రం కాంగ్రెస్ ను దూరం పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అయినా సరే ఆ పార్టీ నిర్ణయాలు ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటాయని.. పైగా ఇప్పుడు కుల అహంకారం ఉండే రేవంత్ ను చూసి ముస్లిం ఓటర్లు ఎవరూ కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోవట్లేదు.

వాస్తవాంగా ముస్లింలు మొదటి నుంచి కాంగ్రెస్ వైపే ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. బీఆర్ ఎస్ వైపే సర్వ మతాల వారు వచ్చి చేరారు. హైదరాబాద్ లో అత్యధికంగా ఉండే ముస్లిం ఓటర్లు కూడా ఇప్పుడు బీఆర్ ఎస్ కు మాత్రమే జై కొడుతున్నారు. అంతెందుకు ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీకే మద్దతు తెలుపుతోంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓటర్లు మొత్తం ఇప్పుడు బీఆర్ ఎస్ కే ఓటేస్తామంటున్నారు. రీసెంట్ గా చేసిన ఆత్మసాక్షి సర్వేలో ముస్లి ఓటర్లు మొత్తం బీఆర్ ఎస్ వైపే ఉన్నారని తేలిపోయింది.

హిందూ మతం వారు బీఆర్ఎస్ కు 46శాతం, కాంగ్రెస్ కు 40శాతం, బీజేపీకి 12శాతం మద్దతుగా నిలువనున్నారు. ముస్లింలు బీఆర్ఎస్ కు 47శాతం, కాంగ్రెస్ కు 44 శాతం, బీజేపీ 3శాతం, ఇతరులకు ఆరు శాతం మాత్రమే వేస్తున్నారు. అదే సమయంలో అటు క్రైస్తవులు బీఆర్ఎస్ కు 45శాతం, కాంగ్రెస్ కు 42శాతం, బీజేపీకి 3శాతం, ఇతరులు 10శాతం అండగా నిలువనున్నారని సర్వే వెల్లడించింది. దాన్ని బట్టి బీఆర్ ఎస్ అన్ని వర్గాల వారు అండగా ఉన్నారని తేలిపోయింది. బీజేపీకి హిందువు ఎక్కువగా ఓట్లేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీని హిందువులు కూడా నమ్మట్లేదు.

బీఆర్ ఎస్ ను అన్ని మతాల వారు నమ్మినంతగా మిగతా పార్టీలను పెద్దగా నమ్మట్లేదు. దాన్ని బట్టి
రాబోయే ఎన్నికల్లో ఈ వర్గాల వారు, ఈ మతాల వారు అంతా కూడా బీఆర్ ఎస్ వైపే ఉంటారని స్పష్టం అవుతోంది. గతంలో కంటే ఎక్కువగా ఈ సారి హిందువులు బీఆర్ ఎస్ కు ఓటేస్తారని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

ఎందుకంటే మతాన్ని చూసి ఓటేయడం కంటే కూడా సంక్షేమ పాలనను చూసి ఓటేయాలని అందరూ డిసైడ్ అవుతున్నారు. బతుకులను బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఉన్న బీఆర్ ఎస్ కు ఓటేయడమే బెటర్ అని అంటున్నారు. కాబట్టి మూడోసారి బీఆర్ ఎస్ అధికారంలోకి రావడం ఖాయమే అని అంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us