మోస్ట్ డిస్ లైకుడ్ ట్రైలర్ గా అలియా భట్ కొత్త సినిమా నేపోటిజం పేరుతో సుశాంత్ సింగ్ ఫాన్స్ దండయాత్ర

Advertisement

బాలీవుడ్ లో అలియా భట్ నటించిన కొత్త సినిమా సడక్2 ట్రైలర్ రిలీస్ అయ్యింది. అయితే ఈ ట్రైలర్ లో అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, పూజ భట్ మరియు సంజయ్ దత్ లు నటించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సడక్ 2 ట్రైలర్ ను ఆగష్టు 12 వ తేదీన రిలీస్ చేసారు. అయితే ఈ ట్రైలర్ కు అత్యధిక డిస్ లైకులు వచ్చిన ట్రైలర్ గా నిలిచిపోయింది. నేపోటిజం పేరుతో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ట్రైలర్ ను 15 లక్షల మంది వీక్షించగా, దాంట్లో 8.9 లక్షల మంది డిస్ లైక్ చేసారు. ఒకవైపు సుశాంత్ ఫాన్స్ ఈ ట్రైలర్ పై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. సుశాంత్ సింగ్ తాజాగా నటించిన చివరి సినిమాకు పది మిలియన్ల మంది లైక్ చేసారు. అదే తరుణంలో ఈ సడక్ 2 ట్రైలర్ కు పది మిలియన్ల డిస్ లైకులు ఇవ్వాలని అభిమానులు వాక్యాలు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here