Alia Bhatt : బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తెలుగు మాట్లాడటం ఎప్పుడైనా చూశారా? తను బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ… ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోందో అప్పుడే తను తెలుగు అమ్మాయి అయిపోయింది. తెలుగు హీరోయిన్ అయిపోయింది. ఆర్ఆర్ఆర్ సెట్స్ కాస్తో కూస్తో తెలుగు నేర్చుకున్నట్టుంది అలియా. అందుకే… తెలుగులో చించేసింది. అది కూడా వకీల్ సాబ్ సినిమా కు ఆల్ ది బెస్ట్ చెప్పడం.

తాజాగా అలియా భట్ ఒక వీడియోను రిలీజ్ చేసింది. అందులో అందరికీ నమస్కారం… అంటూ తెలుగులో మొదలు పెట్టి… పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ విడుదల సందర్భంగా ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్, మూవీ టీమ్ కు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు.. అంటూ తెలుగులో అలియా భట్ చెప్పడంతో పవన్ అభిమానులు భలే ఖుషీ అవుతున్నారు.
ఎంతైనా పవన్ కళ్యాణ్… పవన్ కళ్యాణే… తెలుగులో పవన్ తర్వాతే ఎవ్వరైనా. అందుకే ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ కూడా వకీల్ సాబ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతోందంటే… అది పవన్ కళ్యాణ్ రేంజ్… అంటూ పవన్ ఫ్యాన్స్ మస్తు ఖుషీ అవుతున్నారు.
వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ వెండి తెర మీద కనిపించనుండటంతో… ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.