Ali And Pawan Kalyan : పవన్ కల్యాణ్ మీద పోటీ చేస్తా.. నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు..!
NQ Staff - January 17, 2023 / 03:05 PM IST

Ali And Pawan Kalyan : ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్-అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. మొదటి నుంచి ఒకరంటే ఒకరికి అమితమైన అభిమానం. కమెడియన్ గా ఎదిగిన అలీ.. పవన్ కల్యాణ్ తో మంచి స్నేహ బంధాన్ని ఏర్పరుచుకున్నాడు. అలీ లేకుండా పవన్ అప్పట్లో ఒక్క సినిమా కూడా తీసేవాడు కాదు.
ఎందుకు అని అడిగితే అలీ నా గుండెకాయ అని ఎన్నోసార్లు స్టేజిమీదనే చెప్పాడు పవన్ కల్యాన్. అంత అనుబంధం ఉన్న ఈ ఇద్దరూ రాజకీయానికి వచ్చే సరికి మాత్రం విరోధులు అయిపోయారు. పవన్ జనసేన పార్టీ పెట్టుకుంటే, అలీ మాత్రం వైసీపీలో కొనసాగుతున్నాడు. ఇక అప్పుడప్పుడు పవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు అలీ.
జగన్ ఆదేశిస్తే..
ఇక తాజాగా మరోసారి దుమారం రేపే కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మీడియాలో మాట్లాడిన అలీ.. జగన్ ఆదేశిస్తే పవన్ కల్యాణ్ మీద పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. జగన్ చెప్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానంటూ ప్రకటించాడు.
రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు కచ్చితంగా ఉంటాయన్నాడు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పవన్ మీద ఇలాంటి కామెంట్లు చేసి అలీ పవన్ ఫ్యాన్స్‌కు, మెగా కాంపౌండ్ కు టార్గెట్ అయిపోయినట్టు తెలుస్తోంది. అలీ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.