Alekya Reddy : అయిన వాళ్లే వేధించారు.. అత్త, మామలపై తారకరత్న భార్య సంచలన ఆరోపణలు..!
NQ Staff - March 19, 2023 / 07:53 PM IST

Alekya Reddy : తారకరత్న చనిపోయి నేటికి నెలరోజులు కావస్తోంది. కానీ ఆయన గురించి ఇంకా ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్యరెడ్డి ఈ నడుమ చేస్తున్న పోస్టులు సంచలనంగా మారుతున్నాయి. తన మనసులో ఉన్న బాధలను ఆమె ఒక్కొక్కటిగా బయటకు చెప్పుకొస్తోంది. దాంతో ఆమె ఎప్పుడు ఏం ట్వీట్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
తారకరత్న గత నెలలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అలేఖ్యరెడ్డిని ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. కానీ వీరి వివాహం ఇంట్లో వారికి అస్సలు ఇష్టం లేదు. అప్పటినుంచి కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు. ఇక తాజాగా అలేఖ్యరెడ్డి ఓ పోస్టు చేసింది.
ఎన్నో బాధలు పడ్డాం..
ఇందులో.. నువ్వు దూరం అయి నెల రోజులు కావస్తోంది. కానీ నీ జ్ఞాపకాలు ఇంకా దహించి వేస్తూనే ఉన్నాయి. నీ పోరాట ఫలితంగానే మన పెండ్లి జరిగింది. ఎన్నో బాధలు పడ్డాం. అయిన వాళ్లే మనల్ని వేధించారు. నిషిక పుట్టిన తర్వాత మన లైఫ్ మారిపోయింది. ఏదేమైనా నువ్వు రియల్ హీరోవు. వి మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్టు చేసింది.
దాంతో ఆమె ఇన్ డైరెక్టుగా తన అత్త, మామలపైనే ఆరోపణలు చేసిందని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే తారకరత్నను పెండ్లి అయిన తర్వాత ఆయన తల్లి, దండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు. అప్పటి నుంచి వేరుగానే ఉంటున్నాడు తారకరత్న. కాబట్టి ఇప్పుడు అలేఖ్య రెడ్డి కూడా వారిని ఉద్దేశించే పోస్టు చేసిందని అంటున్నారు.