BALA KRISHNA: ఆనంద‌య్య మందుపై బాల‌కృష్ణ స్పంద‌న ఇదే..!

క‌రోనా విజృంభిస్తున్న వేళ ప్ర‌జ‌లంద‌రు కృష్ణ ప‌ట్నంకు క్యూ క‌డుతున్న వేళ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు ఆనంద‌య్య‌. ఆయ‌న మందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేక‌పోగా, క‌రోనా త్వ‌ర‌గా త‌గ్గిపోతుంద‌ని ప్ర‌జ‌లు చాలా విశ్వ‌సిస్తున్నారు. కొంద‌రు మాత్రం కొట్టి పారేస్తున్నారు. అయితే ఆనంద‌య్యకు కొందరు సినీ ప్ర‌ముఖులు కూడా మ‌ద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవ‌ల జ‌గ‌ప‌తి బాబు ఆనంద‌య్య‌కు త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌గా, తాజ‌గా ఆనందయ్య కరోనా నాటు మందుపై తెలుగు సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా స్పందించారు.

ఎన్టీఆర్ 98వ జయంతి సంధర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద‌కు కార్య‌క‌ర్త‌ల‌తో చేరుకున్న బాల‌కృష్ణ త‌న తండ్రికి నివాళ‌లుఉ అర్పించిన త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఆనందయ్య మందుపై తనదైన శైలిలో కామెంట్ చేశారు.నాకు నమ్మకం ఉందయ్యా.. అభిమానం లేనిదే ఆరాధన లేదు.. ఆరాధన లేనిదే మతం లేదు. మతం లేనిదే మానవుడే లేడు. అలాగే ప్రతీది ఒక నమ్మకం.. నేను నమ్ముతాను తప్పకుండా… ఎందుకంటే గొప్పగొప్ప వైద్యులున్నారు. క్రీస్తు పూర్వమే సుశంకుడనే వైద్యుడుండే వాడు.. ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో ఇవాళ్టికి కూడా రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీ లో ఆయన పేరుంది అని బాలయ్య వ్యాఖ్యానించారు. అలానే త‌న తండ్రి జీవితాన్ని పాఠ్యాంశాల‌లో చేర్పించాల‌ని కూడా కోరాడు.