PUBG లాగ అక్షయ్ కుమార్ కొత్త గేమ్ వచ్చిన లాభాల్లో 20% వాటా

Advertisement

భద్రతా చర్యల దృశ్య భారత ప్రభుత్వం చైనాకు చెందిన యాప్స్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అలా బ్యాన్ చేసిన వాటిలో యువతను బాగా ఆకట్టుకున్న టిక్ టాక్ మరియు పబ్ జి కూడా ఉన్నాయి. ఈ యాప్స్ బ్యాన్ అయిన తరువాత వాటికి ఆల్టర్ నేటివ్ యాప్స్ ను తయారు చేయడానికి భారతీయ సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో పబ్ జి లాంటి గేమ్ ను డెవలప్ చేయడానికి హీరో అక్షయ్ కుమార్ పూనుకున్నారు.

ఒక గేమింగ్ సంస్థతో కల్సి ఈ ముల్టి ప్లేయర్స్ గేమ్ ను అక్షయ్ కుమార్ డెవలప్ చేయనున్నారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ఆత్మ నిర్భార్ మూవ్మెంట్ ను ఆదర్శంగా తీసుకొని ఈ యాప్ ను డెవలప్ చేస్తున్నామని అక్షయ్ కుమార్ వెల్లడించారు.ఈ గేమ్ కు FEARLESS AND UNITED-GUARDS(FAU-G) అనే పేరును ఖరారు చేశారు. ఈ యాప్ ద్వారా వచ్చే ఇన్కమ్ లో 20% భారత సైన్యానికి ఇస్తామని అక్షయ్ కుమార్ వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here