Akshay-kumar: స‌మంత ఇంట్లో దొంగ‌త‌నం.. స్టార్ హీరోని అరెస్ట్ చేసిన పోలీసులు

Akshay-kumar: అందాల ముద్దుగుమ్మ స‌మంత ప‌ర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతుంది.ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు యాడ్స్, ఇంకోవైపు సోష‌ల్ మీడియాతో స‌మంత హంగామా మాములుగా లేదు. చైతూ నుండి విడిపోయాక స‌మంత కెరియర్ ఏమవుతుందో అని అంద‌రు అనుకున్నారు. కాని ఈ అమ్మ‌డు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది.

akshay-kumar-breaks-into-samantha-house
akshay-kumar-breaks-into-samantha-house

స‌మంత సినిమాల‌తోనే కాదు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో కూడా రెండు చేతులా సంపాదిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి ఓ యాడ్ చేసింది. అక్ష‌య్ కుమార్ ఎన్నో బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుర్ కురే చిప్స్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీనికి సంబందించిన యాడ్ ఇటీవలే రిలీజ్ అయ్యింది.

ఇక ఈ యాడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉండడం విశేషం. ఈ యాడ్ లో అక్షయ్ కుమార్ అర్ధరాత్రి సమంత ఇంటికి దొంగతనానికి వస్తాడు. అక్కడ కుర్ కురే ప్యాకెట్ చూసి దాన్ని విప్పబోతాడు. ఆ సౌండ్ కి సమంత ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తుంది. అక్షయ్ చేతిలో ఉన్న కుర్ కురే ప్యాకెట్ ని లాక్కొని ఫ్యామిలీ అంతా తింటూ ఉంటారు.

దాంతో అక్ష‌య్‌కి కూడా నోరు ఊరుతుంది. తనకి పెట్టమని అడగడంతో సామ్, అక్షయ్ కి ఆ ప్యాకెట్ ఇస్తుంది. అది ఖాళీ చేసి వెళ్తుండగా.. బండి వస్తుంది ఆగమని చెప్తోంది.. ఓ బండి కూడా ఇస్తారా అని అక్షయ్ ఆనందపడేలోపు పోలీస్ సైరెన్ మోగుతోంది. దీంతో అక్షయ్ పని అయిపోతోంది.

akshay-kumar-breaks-into-samantha-house
akshay-kumar-breaks-into-samantha-house

ఇక ఈ యాడ్ ని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ” సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన హీరో కుర్ కురే దొంగగా మారిపోయాడు. అక్షయ్ కుమార్ ఏంటి ఈ ప్రవర్తన” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా, స‌మంత ప్ర‌స్తుతం య‌శోద చిత్రంతో బిజీగా ఉంది.