Akkineni Nagarjuna Remuneration In D15 Movie : ధనుష్ సినిమాలో నాగార్జున.. పారితోషికం ఎంతో తెలుసా?
NQ Staff - July 29, 2023 / 07:20 PM IST

Akkineni Nagarjuna Remuneration In D15 Movie :
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే సార్ అనే సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సార్ సినిమా కంటే ముందే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఒక సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.
ఆ సినిమా ప్రకటన వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో ధనుష్ మరియు శేఖర్ కమల మధ్య విభేదాల కారణంగా సినిమా ఆగి పోయి ఉంటుందని అంతా భావించారు. కానీ ధనుష్ పుట్టినరోజు సందర్భంగా శేఖర్ కమ్ముల సినిమా పై అధికారిక ప్రకటన మరోసారి వచ్చింది.
శేఖర్ కమ్ముల సూపర్ స్క్రిప్ట్…
ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రకటన వచ్చింది. ఇప్పటి వరకు నాగర్జున హీరోగా మాత్రమే నటిస్తూ వచ్చాడు. కొన్ని సినిమాలో గెస్ట్ గా కనిపించాడు. కానీ ఈసారి మాత్రం ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించేందుకు ఓకే చెప్పాడు. అయితే నాగార్జున భారీగా పారితోషికం తీసుకుని మరి ఆ పాత్రను చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Akkineni Nagarjuna Remuneration In D15 Movie
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్ సినిమాలో నటించేందుకుగాను నాగార్జున ఏకంగా 12 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున హీరోగా నటించిన సినిమాలకు కూడా కాస్త అటు ఇటుగా ఈ స్థాయిలోనే పారితోషికం అందుకుంటూ ఉంటాడు. నాగార్జునకు ఈ స్థాయిలో పారితోషికం ఇస్తే ధనుష్ కి ఎంతో మీరే ఊహించుకోవచ్చు. ఇక ఈ సినిమా ను శేఖర్ కమ్ముల అద్భుతమైన స్క్రిప్ట్ తో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.