Bigg Boss 7 : బిగ్ బాస్-7కి హోస్ట్ ఎవరో తేలిపోయింది.. కానీ అదే బిగ్ ట్విస్ట్..!
NQ Staff - June 21, 2023 / 10:31 AM IST

Bigg Boss 7 : బిగ్ బాస్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు ఆరు సీజన్లు బాగానే నడిచాయి. కానీ రాను రాను బిగ్ బాస్ కు తెలుగులో క్రేజ్ బాగా పడిపోతోంది. ముఖ్యంగా ఆరో సీజన్ కు రేటింగ్స్ దారుణంగా వచ్చాయి. ఇందుకు షోలోని కొన్ని గేమ్స్ కారణం అయితే.. మరో కారణం హోస్ట్ నాగార్జున.
మోస్ట్ గా బిగ్ బాస్ నాలుగో సీజన్ వరకు బాగానే చేశాడు నాగార్జున. ఆ తర్వాత నుంచే ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగా ఆయన్ను తీసేయాలనే డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఆయన మోనోటనీగా చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆడియెన్స్ నుంచి కూడా నాగ్ హోస్ట్ గా తీసేయాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఏడో సీజన్ కు హోస్ట్ గా విజయ్ దేవరకొండ చేస్తారని అంతా అనుకున్నారు. రౌడీ హీరో చేస్తే ఆ క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుందని అంటున్నారు . కానీ ఆ తర్వాత బాలయ్య పేరు బలంగా వినిపించింది. అన్ స్టాపబుల్ షోను నెంబర్ వన్ లో నిలిపిన బాలయ్య అయితేనే బాగుంటుంది అంతా అనుకున్నారు.

Akkineni Nagarjuna Hosting Season Of Bigg Boss 7
కానీ ఇప్పుడు బిగ్ ట్విస్ట్ వచ్చేసింది. అదేంటంటే.. ఈ సారి ఏడో సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ప్రసన్న కుమార్ తో చేస్తున్న సినిమా మాత్రమే ఉంది. దాని తర్వాత ఆయన పెద్దగా ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. కాబట్టి ఖాళీగానే ఉంటున్నాడు. కాబట్టి బిగ్ బాస్ కు ఎక్కువ రోజులు కేటాయించే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన్నే కంటిన్యూ చేస్తున్నారు.