Akkineni Nagarjuna Anger On Housemates : హౌస్ మేట్స్ కు క్లాస్ పీకిన నాగార్జున.. పవర్ అస్త్రా ఎవరు గెలిచారంటే..?

NQ Staff - September 17, 2023 / 11:18 AM IST

Akkineni Nagarjuna Anger On Housemates : హౌస్ మేట్స్ కు క్లాస్ పీకిన నాగార్జున.. పవర్ అస్త్రా ఎవరు గెలిచారంటే..?

Akkineni Nagarjuna Anger On Housemates :

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకూ అట్టహాసంగా సాగుతోంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తి అయ్యాయి. కాగా నిన్న శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక శనివారం నాగార్జున మళ్లీ వచ్చేశాడు. వస్తూనే అందరికీ క్లాస్ తీసుకున్నాడు. దెబ్బకు అందరికి ఫుల్ మీల్స్ పెట్టేశాడు. ఇక రెండో పవరాస్త్ర సొంతం చేసుకున్నది ఎవరో కూడా చెప్పాడు. పవర్ అస్త్రా కోసం ముగ్గురు షకీలా, శివాజీ, అమర్ దీప్ చౌదరి ముగ్గురు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురికి గార్డెన్‍ లో ఏర్పాటు చేసిన చెవిలో గట్టిగా ఎవరు అరుస్తారో వాళ్లే గెలిచినట్లు అని బిగ్ బాస్ పోటీ పెట్టాడు.

ఇక చెవిలో గట్టిగా ఎవరు అరిచారని అనుకుంటున్నావ్ అని సింగర్ దామినిని అడిగాడు నాగార్జున. దామిని సింగర్ కాబట్టి ఆమెకు డెసిబల్, ప్రీక్వెన్సీ తెలుసని నాగార్జున వివరించాడు. సింగర్ దామిని తనకు నచ్చింది షకీలా మాత్రమే అని.. ఆమెనే గెలిచిందని చెప్పాడు. తర్వాత శివాజీని, అమర్ దీప్ చౌదరి ఇద్దరిని అడిగాడు నాగ్. వారు తమ పేర్లు తాము చెప్పేసుకున్నారు. ఇలా గట్టిగా అరిచిన ఈ ముగ్గురిలో అందరికంటే ఎక్కువ శివాజీకి మార్కులు వచ్చాయి. షకీలాకు 9 మార్కులు, అమర్ దీప్‍కు -6, శివాజీకి 11 మార్కులు వచ్చాయి. దీంతో రెండో పవర్ అస్త్రాను శివాజీ సొంతం చేసుకున్నాడు.

మొదటి పవర్ అస్త్రాను గెలుచుకున్న ఆట సందీప్ దాన్ని శివాజీకి ఇచ్చేశాడు. ఆ పవర్ అస్త్రాను తన రెండో కొడుకు రిక్కికీ అంకితమిస్తున్నట్టు తెలిపాడు శివాజీ. ఇక పవర్ అస్త్రాను గెలుచుకున్నందుకు శివాజీకి కంగ్రాట్స్ చెప్పాడు నాగార్జున. అదే సమయంలో పొట్టు పొట్టు తిట్టేశాడు. ఎందుకంటే శివాజీ పదే పదే బిగ్ బాస్ ను చులకన చేసి మాట్లాడటం.. ఇంటికి వెళ్లిపోతారా నాయనా.. గేట్స్ తెరవండి అంటూ ఇలా అంటున్న వీడియోలను ప్లే చేసి చూపించాడు నాగార్జున. దాంతో శివాజీ ముఖం వాడిపోయింది. ఇక ఏదైతేనేం శివాజీ పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయాడు.

Akkineni Nagarjuna Anger On Housemates

Akkineni Nagarjuna Anger On Housemates

ఇక శివాజీ తాను అలా మాట్లాడినందుకు నాగార్జునకు సారీ చెప్పాడు. సందర్భాన్ని బట్టి తాము నిర్నయం తీసుకుంటామని.. బిగ్ బాస్ ను ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేదు అని నాగార్జున తెగేసి చెప్పేశాడు. నాగార్జున మాటలకు శివాజీ కూడా కన్విన్స్ అయ్యాడు. ఇక నుంచి తాను అలా ప్రవర్తించబోనని చెప్పేశాడు శివాజీ.

అయితే షకీలా గెలుస్తుందని అంతా అనుకున్నారు గానీ.. అలా జరగలేదు. ఈ వారంలో ఓటింగ్ లో షకీలా చివరలో ఉంది. ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ చివరి నిముషంలో ఏదైనా ట్విస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us