Akkineni Naga Chaitanya : బాలయ్యకు కౌంటర్ ఇచ్చిన నాగచైతన్య.. మా తాతను అవమానిస్తావా అంటూ..!
NQ Staff - January 24, 2023 / 01:50 PM IST

Akkineni Naga Chaitanya : నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టిన ముఖ్యులు. అప్పట్లో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారు. అయితే మధ్యలో ఏమైందో తెలియదు గానీ.. అక్కినేని, నందమూరి ఫ్యామిలీల నడుమ వైరం రాజుకుంది. అప్పటి నుంచి నాగార్జున, బాలయ్య ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోవట్లేదు. ఇద్దరూ కనీసం మాట్లాడుకోరు కూడా.
అయితే తాజాగా బాలయ్య చేసిన కామెంట్లు ఈ వైరాన్ని మరింత పెంచాయి. బాలయ్య రీసెంట్ గా నటించిన మూవీ వీరసింహారెడ్డి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చి మంచి హిట్ అందుకుంది. దాంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ నోరు జారాడు.
నోరు జారిన బాలయ్య..
తన పక్కనున్న వ్యక్తి గురించి మాట్లాడుతూ ఆ రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని.. అంటూ బాలయ్య నోరు జారాడు. దాంతో అక్కినేని నాగేశ్వర్ రావు వర్థంతి నాడు ఆయన్ను ఇలా అవమానిస్తావా అంటూ బాలయ్య మీద అక్కినేని ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా ఈ ఇష్యూ మీద స్పందించాడు.
ట్విట్టర్ వేదికగా ఆయన రాసుకొస్తూ.. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవ పరచటం మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ చురకలంటించాడు చైతూ. ఈ మాటలు ఇన్ డైరెక్టుగా బాలయ్యను ఉద్దేశించే చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి దీనిపై బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023