Balakrishna : బాలయ్య మాటలపై నాగార్జున మౌనం.. కొడుకుగా బాధ్యత లేదా..?
NQ Staff - January 25, 2023 / 11:19 AM IST

Balakrishna : ఇప్పుడు టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి, నందమూరి బాలయ్యకు మధ్య పోరు నడుస్తోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో అక్కినేని నాగార్జునకు, బాలయ్యకు మధ్య వైరం ఉందనేది కాదనలేని వాస్తవం. అందుకే ఏఎన్నార్ చనిపోయినప్పుడు కూడా బాలయ్య కనీసం చూడటానికి రాలేదు. అప్పటి నుంచే ఈరెండు ఫ్యామిలీల మధ్య వైరం మరింత పెరుగుతూ వస్తోంది.
అయితే తాజాగా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య నోరు జారుతూ అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడాడు. ఈ కామెంట్లపై అక్కినేని ఫ్యాన్స్ గరం అవుతున్నారు. బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై అక్కినేని అఖిల్, నాగచైతన్య కూడా చాలా సీరియస్ గా స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా చేశారు. కానీ ఈ ఇష్యూ మీద నాగార్జున మాత్రం ఇప్పటి వరకు స్పందించట్లేదు. అసలు ఏఎన్నార్ కొడుకుగా నాగార్జునకు ఎక్కువ బాధ్యతలు ఉండాలి. కానీ ఆయన మాత్రం స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్.
ఆల్రెడీ వైరం ఉందట..
అయితే నాగార్జున కావాలనే స్పందించట్లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ బాలయ్యతో ఆయనకు వైరం ఉంది. ఇప్పుడు ఈ వివాదంలో తాను తలదూరిస్తే తన స్థాయి తగ్గుతుందని ఆయన భావిస్తున్నారంట. బాలయ్య మాటలను ఆయన సంస్కారానికే వదిలేసినట్టు చెబుతున్నాయి అక్కినేని వర్గాలు. ఇక నాగార్జున సైలెంట్ గా ఉంటూనే తన కొడుకులతో తన ఫ్యాన్స్ తో బాలయ్య మీద ఒత్తిడి తెచ్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది.