Akhil: మోనాల్‌ని డ్రామా క్వీన్ అంటూ అఖిల్ పోస్ట్..ఇద్దరి మ‌ధ్య ఏం జ‌రిగింది?

Akhil: వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో ఎంత ఫేమ‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షో ద్వారా చాలా మందికి పాపులారిటీ ద‌క్కింది. కొన్ని జంట‌లు హైలైట్‌గా నిలిచాయి. బిగ్ బాస్ సీజ‌న్ 4లో అఖిల్‌- మోనాల్ జంట‌కు బాగా గుర్తింపు దక్కింది. ప్రేమ ప‌క్షుల్లా బిగ్ బాస్ హౌజ్‌లో కనిపించిన ఈ జంట బయ‌ట‌కు వ‌చ్చాక కూడా చాలా అన్యోన్యంగా క‌నిపిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు వీరి చేష్టలు ప్రేక్ష‌కుల‌కి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించాయి. అప్ప‌టి వ‌ర‌కు మంచిగానే ఉంటూ ఒక్కోసారి సీరియ‌స్‌గా ఉంటారు. అయితే దాదాపు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఆడుతూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో గొడవల్లో భాగం అయ్యారు. ఇక, రొమాంటిక్ యాంగిల్‌ను చూపిస్తూ.. అప్పుడప్పుడూ ముద్దులు, హగ్గులతో ప్రేమను పండిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు.

బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా ఈ జంట త‌మ జోరు త‌గ్గించ‌లేదు. క‌లిసి షోలు చేయ‌డం, ఫొటోషూట్స్ లో పాల్గొన‌డం, మ‌ధ్య‌మ‌ధ్య‌లో చ‌క్క‌ర్లు కొట్ట‌డం వంటివి చేశారు. ఈ జంట‌కు ఇప్పుడు సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు వ‌స్తున్నాయి. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ మూవీని ప్రకటించడంతో పాటు మరోసారి డిజైరబుల్ మ్యాన్‌గా సెలెక్ట్ అయ్యాడు.

బిగ్ బాస్ హౌస్‌లో జంటగా దాదాపు 13 వారాల పాటు హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఏడాది వాలంటైన్స్‌డే సంద‌ర్భంగా అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి’ అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

కొన్ని కార‌ణాల వ‌ల‌న ఇది ఇంకా ప్రారంభం కాలేదు.అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అఖిల్ అప్పుడ‌ప్పుడు మోనాల్‌కి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇస్తుంటాడు. తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెడుతూ మోనాల్‌పై అఖిల్ సార్థక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అఖిల్, మోనాల్ తాజాగా వీడియో కాల్ మాట్లాడుకోగా, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన అఖిల్..అతడు.. ‘హాహా క్యూటీ.. ఏమైంది నీకు? డ్రామా క్వీన్’ దానిపై రాసుకొచ్చాడు.

అఖిల్ షేర్ చేసిన పిక్‌లో మోనాల్ అమ్మోరు మాదిరిగానే చాలా సీరియ‌స్‌గా క‌నిపిస్తుంది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింద‌నే అనుమ‌నాలు తలెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, నెటిజ‌న్స్ ఏం జ‌రిగింద‌నే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.