అక్కినేని అఖిల్ సినిమాకు 25 సంవత్సరాలు

Advertisement

అక్కినేని అఖిల్ నటించిన మూవీ ఇవ్వాళ్టికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అక్కినేని అఖిల్ హీరోగా 2015లో అఖిల్ మూవీతో వివి వినాయక్ దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ అయ్యారు కానీ అఖిల్ చిన్నప్పుడు నటించిన మూవీ నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అక్కినేని అఖిల్ చిన్నప్పుడు సిసింద్రీ అనే మూవీలో నటించారు. ఈ విడుదల అయ్యి నీటిని 25 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.

ఈ మూవీలో నాగార్జున, టబు, శరత్ బాబు, ఆమని ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీని హాలీవుడ్ లో వచ్చిన బేబీస్ డే ఔట్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. ఈ మూవీని శివ నాగేశ్వర రావు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో తనికెళ్ల భరణి, గిరిబాబు, సుధాకర్ కామెడీ చాలా అద్భుతంగా ఉంటుంది. సిసింద్రీ అప్పట్లో చాలా పెద్ద హిట్ గా నిలిచింది. అయితే చిన్నప్పుడే హిట్ అందుకున్న అఖిల్ ఇప్పటి హిట్ అందుకోలేపోతున్నారు. ఇప్పటికే అఖిల్, హలో, మిస్టర్ మజ్ను లాంటి మూవీస్ లో హీరోగా నటించినప్పటికీ అవి అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. త్వరలో రానున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీతోనైనా హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here