akhil : త‌న సినిమాకు టైం ఫిక్స్ చేసిన అఖిల్..ఇక అక్కినేని అభిమానులు బీ రెడీ!

Akhil : అక్కినేని మూడో త‌రం వార‌సుడు అఖిల్ మంచి హిట్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ అనే సినిమా చేస్తుండ‌గా, ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది.

అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాల త‌ర్వాత అఖిల్ న‌టిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌.ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో అందంగా ఈ సినిమాని రూపొందించిన‌ట్టు తెలుస్తుంది. జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. జూన్ 19న మూవీ థియేట‌ర్స్‌ల‌కి రానున్న‌ట్టు తెలియ‌జేశారు.అఖిల్, పూజాహెగ్డేలు రొమాంటిక్‌గా చూసుకుంటూ ఉన్న పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ మూవీ విడుద‌ల తేది ప్ర‌క‌టించారు.దీంతో అఖిల్ అభిమానులు జూన్ 19 కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement