సురేందర్ రెడ్డితో మూవీ చేయనున్న అక్కినేని అఖిల్

Advertisement

అక్కినేని వారసుడు అఖిల్ ఇందుస్ర్టీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు . ఇప్పటి వరకు అఖిల్, హలో, మజ్ను లాంటి మూవీస్ చేసినప్పటి ఒక్క హిట్ కదా కనీసం యావరేజ్ హిట్ కూడా రాలేదు. అఖిల్ ఇప్పటి వరకు వివి వినాయక్, విక్రమ్ కె కుమార్, వెంకీ అట్లూరి లాంటి దర్శకులతో పని చేశారు కానీ హిట్ ను మాత్రం సొంతం చేసుకోలేపోతున్నారు.

అఖిల్ కు మూవీ ప్లాప్ అయిన ప్రతిసారి నాగార్జున మళ్ళీ లాంచ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే మూడు మూవీస్ కు మూడుసార్లు లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు అఖిల్ సురేందర్ రెడ్డితో మూవీ చేయనున్నారు. ఈ మూవీని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి మూవీ తరువాత సురేందర్ రెడ్డి చేస్తున్న మూవీ ఇదే. అఖిల్ కూడా ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీస్ తోనైనా అఖిల్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here