Ajaz Patel : భార‌త్‌పై స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్పిన అజాజ్ ప‌టేల్.. ప‌ది వికెట్లు ఆయ‌న ఖాతాలోనే!

Ajaz Patel : ప్ర‌స్తుతం భార‌త్ న్యూజిలాండ్ మ‌ధ్య టెస్ట్ సిరీస్ హోరాహోరీగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. తొలి టెస్ట్ డ్రాగా ముగియ‌గా, భార‌త్‌కు విజ‌యం ద‌క్క‌కుండా చేసింది భార‌త సంత‌తి ఆట‌గాళ్లు. రచిన్ రవీంద్రతో పాటు అజాజ్ పటేల్‌ వికెట్లకు అడ్డుగా నిలబడి, భారత జట్టు విజయాన్ని దూరం చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు, ఆఖరి వికెట్‌ని తీయలేకపోవడానికి కారణం ఈ ఇద్దరూ భారత స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడమే.

Ajaz Patel 10 wickets in an innings vs india
Ajaz Patel 10 wickets in an innings vs india

మొన్న బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టిన అజాజ్ ఇప్పుడు జ‌రుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌తో అద‌ర‌గొట్టాడు. న్యూజిలాండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్లు ఫెయిల్ అయిన చోట, ముంబైలో పుట్టిన అజాజ్ పటేల్… సొంత గడ్డపై చిరకాలం గుర్తుండిపోయే బౌలింగ్ వేశాడు.శుబ్‌మన్‌ గిల్‌ను అవుట్ చేసి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడగొట్టిన అజాజ్ పటేల్, ఆ తర్వాత కొద్దిసేపటికే ఛతేశ్వర్ పూజారాను క్లీన్ బౌల్డ్ చేశాడు…

Ajaz Patel 10 wickets in an innings vs india
Ajaz Patel 10 wickets in an innings vs india

విరాట్ కోహ్లీ అవుట్ విషయంలో వివాదం నెలకొన్నా, గత మ్యాచ్‌లో సెంచరీ చేసి అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు అజాజ్ పటేల్. ఇక రెండో రోజు మిగ‌తా ఆరు వికెట్లు కూడా అజాజ్ ప‌టేల్ ఖాతాలోనే చేరాయి. గ‌తంలో అనీల్ కూంబ్లే ఈ ఘ‌న‌త ద‌క్కించుకోగా, ఇప్పుడు ప‌ది వికెట్స్ తీసి అరుదైన చ‌రిత్ర సృష్టించాడు.

ఇండియాలో పుట్టి, జన్మస్థలంలో ప్రత్యర్థి జట్టు తరుపున బరిలో దిగిన రెండో భారత సంతతి క్రికెటర్ అజాజ్ పటేల్. ఇంతకుముందు 1933లో ఇంగ్లాండ్ ప్లేయర్ డగ్లస్ జార్డిన్ ముంబైలో పుట్టి, ఇంగ్లాండ్ తరుపున టెస్టు మ్యాచ్ ఆడాడు . ఈ రోజు భార‌త్‌పై ప‌ది వికెట్స్ ప‌డ‌గొట్టి త‌న పేరు స‌రికొత్త రికార్డ్ లిఖించుకున్నాడు.

ప్ర‌స్తుతం భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 325 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. మ‌యాంక్ 150 ప‌రుగులు చేయ‌గా, అక్ష‌ర్ ప‌టేల్ అర్ధ సెంచ‌రీతో మెరిసాడు. మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ అంద‌రు క్యూ క‌ట్టారు.