Ajay: ప‌క్క‌న భార్య‌ని పెట్టుకొని మందు గ్లాస్‌తో ర‌చ్చ చేస్తున్న న‌టుడు అజ‌య్

Ajay: స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ పోషించిన కొంద‌రు న‌టులు అభిమానుల మ‌నసుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. అలాంటి న‌టుల‌లో అజ‌య్ ఒక‌రు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అజయ్‌ హీరోలకు సమానంగా గుర్తింపు పొందాడు. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశ ముదురు,ఛ‌త్ర‌ప‌తి వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్‌గా, ప్రతినాయకుడి పాత్రలు పోషించిన అజయ్‌ ఈ మధ్య తెరపై అరుదుగా కనిపిస్తున్నాడు.

ajay enjoyed with his wife1
ajay enjoyed with his wife1

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ నటుడిగా ఫుల్‌ బిజీగా ఉండే అజయ్‌ ప్రస్తుతం చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మమ అనిపిస్తున్నాడు. కాలేజీ సమయంలో శ్వేత రావురిని ప్రేమించిన అజయ్‌ ఆమెను రహస్య వివాహం చేసుకున్నాడు. ఫస్ట్‌ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్న అజయ్‌ సెటిల్‌ అయ్యాక వారి విషయం ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించారట. పెద్దల సమక్షంలో మరోసారి శ్వేతను వివాహం చేసుకున్నట్లు అజయ్‌ వివరించాడు. కాగా ప్రస్తుతం ఈ జంటకు కూతురు, కుమారుడు సంతానం.

తాజాగా అజయ్ తన భార్యతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. లండన్‌లో గడిపిన క్షణాలను తలుచుకున్నాడు. తన భార్య పక్కనే ఉండగా.. అజయ్ మాత్రం మంచి స్పీడులో ఉన్నాడు. చేతిలో మందు గ్లాసును పట్టుకుని కనిపించాడు. ఇక ఆయన భార్య మాత్రం టీయో, కాఫీయో తాగుతూ కనిపించింది.

ajay enjoyed with his wife2
ajay enjoyed with his wife2

మొత్తానికి అజయ్‌ను, అతని భార్యను ఇలా చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. లండన్ డైరీస్ అంటూ షేర్ చేసిన అజయ్.. అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని కూడా అజ‌య్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు.

2017లో జరిగిన మిస్సెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలలో ఎంపికై చివరి రౌండ్ వరకు చేరిన అజయ్ సతీమణి శ్వేత 2018 లో అంబాసిడర్ మిస్టర్ అండ్ మిస్టర్స్ సౌత్ ఇండియాగా ఎంపికైంది. ప్రస్తుతం “ఆచార్య” సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్న అజయ్ ఇటీవల విడుదలైన “తిమ్మరుసు” సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.