Facebook : ప్రాణం తీసిన ఫేస్బుక్ పరిచయం.! స్మార్ట్ ఫోన్ ఎంత పని చేసింది.?
NQ Staff - December 27, 2022 / 02:24 PM IST

Facebook : స్మార్ట్ ఫోన్ చేతిలో వుంటే చాలు ప్రపంచం మన అరచేతిలో వున్నట్లే. అయితే, ఈ స్మార్ట్ ప్రపంచం నుండి ఎంత మంచి జరుగుతుందో, అంతే చెడు కూడా జరుగుతోంది.
స్మార్ట్‌గా వాడితే అంతా స్మార్ట్‌గానే వుంటుంది. కానీ, మిడి మిడి జ్ఞానంతో కొందరు కోరి చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. కొందరైతే ఇదిగో ఇలా ప్రాణాలే కోల్పోయి కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు.
మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్మెయిల్.!
ముఖ్యంగా సోషల్ మీడియా వాడకంలో భాగమైన ఫేస్బుక్ రిక్వెస్టులు కొంత మేర నష్టం చేకూరుస్తున్నాయ్. కూలి పని చేసుకునే అజయ్ అనే యువకుడి జివితంలో ఫేస్బుక్ పరిచయం తీవ్ర విషాదం నింపింది.
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ అమ్మాయికి బాగా కనెక్ట్ అయిపోయాడు అజయ్. ఆమె తీయని మాటలకు ఐస్ అయిపోయి, కావల్సినప్పుడల్లా డబ్బులు పంపించేవాడు. స్వీటు మాటలు కాస్తా, మొరటుగా మారిపోయాయ్. అజయ్ మాటల్ని రికార్డు చేసి, మార్ఫింగ్ ఫోటోలతో కొన్ని అసభ్యకరమైన వీడియోలు తయారు చేసి, అజయ్‌ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది ఆ ఫేస్బుక్ యువతి.
ఆమె చేష్టలకు భయపడిన అజయ్, తనకు చేతనైనంత వరకూ డబ్బులు ఇస్తూ వచ్చాడు. ఎంతైనా కూలి పని చేసుకునే కుర్రోడు. ఆర్ధిక స్థితి అంతంత మాత్రమే. దాంతో టార్చర్ భరించలేక డబ్బులు పంపడం కుదరదని చెప్పగా, ఫోటోలూ, వీడియోలూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని యువతి బెదిరించింది. దాంతో భయపడిన అజయ్ ఇంట్లో ఫ్యాన్‌కి వురి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు.
తమ బిడ్డకి స్మార్ట్ ఫోన్ కొనిచ్చి ఎంత తప్పు చేశామంటూ తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఫోన్ సంభాషణల ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు.