Aishwarya Rajesh Told About Bad Experiences Of Life : నల్లగా ఉన్నావ్.. నీ ముఖానికి సినిమాలు కావాలా అన్నారు.. ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్..!
NQ Staff - August 4, 2023 / 12:38 PM IST

Aishwarya Rajesh Told About Bad Experiences Of Life :
ఐశ్వర్య రాజేష్ తెలుగు పిల్ల అయినా తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమెకు తెలుగులో కంటే కూడా తమిళంలోనే ఎక్కువ సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె మాత్రం వచ్చిన అవకాశాలను వదులుకోకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ నడుమ ఎక్కవుగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రావట్లేదు.
కానీ కంటెంట్ ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది. అయితే తాను తెలుగు అమ్మాయినే అయినా కూడా తెలుగులో అవకాశాలు రావట్లేదని రీసెంట్ గా స్టేజి మీదనే అసహనాన్ని వెల్లడించింది. ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు అనుభవాలను పంచుకుంది.
ట్యాలెంట్ ఉన్నా..
ఆమె మాట్లాడుతూ.. నేను స్టార్ కిడ్ ను కాదు. చాలా లో బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నా కలర్ గురించి కూడా కామెంట్స్ చేశారు. నల్లగా ఉన్నావ్ నీకు సినిమాలు అవసరమా అంటూ వెక్కిరించారు. నాకు ట్యాలెంట్ ఉన్నా సరే ఛాన్సులు ఇవ్వం అని ముఖం మీదనే చెప్పేశారు.
కొందరు అయితే నా సైజుల గురించి కూడా నీచంగా మాట్లాడారు. కానీ నేను నా ప్రయత్నాలు ఆపలేదు. అందుకే ఈ రోజు మీ అందరి ముందు ఇలా ఉన్నాను అంటూ తెలిపింది ఈ హాట్ బ్యూటీ. ఆమె రీసెంట్ గానే ఫర్హానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.