Aishwarya Rajesh Comments On Star Heroes : స్టార్ హీరోలు వాటిని చూసే ఆఫర్స్ ఇస్తారు.. ఐశ్వర్య రాజేష్ ఇవేం మాటలు
NQ Staff - July 7, 2023 / 07:46 PM IST

Aishwarya Rajesh Comments On Star Heroes :
ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో క్లిక్ అయిన తెలుగు భామ.. ఈమె తమిళ్, మలయాళం, హిందీ సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగమ్మాయి అయిన అవకాశాలు మాత్రం సూన్యం.. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మంచి పేరు ఇచ్చుకుంది..
ఆ తర్వాత ఐశ్వర్య విజయ్ దేవరకొండతో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించి మెప్పించిన కూడా మరో అవకాశం రాలేదు. అయితే స్టార్ హీరోల సినిమాల్లో ఏమాత్రం అవకాశాలు రాకపోవడంపై ఈ భామ తాజాగా స్పందిస్తూ తన బాధనంతా వెళ్లగక్కారు.. తాజా ఇంటర్వ్యూలో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. కాక ముట్టై తర్వాత నాకు ఎవ్వరూ ఆఫర్స్ ఇవ్వక పోవడంతో నేను అయ్యాను.. నా కెరీర్ లో కొంత మంది మాత్రమే ఆఫర్స్ ఇచ్చారు.. మిగతా స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వలేదు.. స్టార్ హీరోలు ఒక హీరోయిన్ ను తీసుకునే క్రమంలో అన్ని లెక్కలు వేస్తారు..
మనం కోరుకున్న స్థాయికి ఎదగాలంటే దేనికైనా సిద్ధంగా ఉండాలి.. అందుకే నేను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాను.. ఇప్పటికే 15 సినిమాలకు పైగానే చేసిన స్టార్ హీరోలు ఆఫర్స్ ఇవ్వడం లేదు.. ఎందుకు ఆఫర్స్ ఇవ్వడం లేదో తెలియదు కానీ నేను బాధ పడడం లేదు.. నాకంటూ అభిమానులు ఉన్నారు అని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..