Airline :  విమానంలో సిగ్గులేని పని చేసిన కుర్రాడికి షాక్ ఇచ్చిన ఎయిర్ లైన్స్‌ సంస్థ

NQ Staff - April 1, 2023 / 03:41 PM IST

Airline :  విమానంలో సిగ్గులేని పని చేసిన కుర్రాడికి షాక్ ఇచ్చిన ఎయిర్ లైన్స్‌ సంస్థ

Airline : ఒక ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ఒక యువకుడు ఎయిర్‌ హోస్టస్‌ ను పిలిచి తన సీటును పక్కకు మార్చాలంటూ కోరాడట. అందుకు అతడు చెప్పిన కారణం విని ఎయిర్‌ హోస్టస్ షాక్ అయ్యారట. అతడు ఏమన్నాడంటే.. తన పక్కన ఉన్న వ్యక్తి చాలా లావుగా ఉన్నాడు. అతడి పక్కన కూర్చోవడం నా వల్ల కావడం లేదు అన్నాడట.

ఆయన చాలా లావుగా ఉండటం వల్ల నా సీటు లో కూడా సగబాగాన్ని ఆక్రమించుకున్నాడు. అందుకే నాకు వేరే సీటు ఇవ్వాలంటూ కొద్ది సమయం హడావుడి చేయడం జరిగిందట. 12 గంటల పాటు ఈయన పక్కన కూర్చుని ప్రయాణించడం ఎలా సాధ్యం.. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉందంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తూ నానా హంగామా చేశాడట.

మొత్తం ప్లైట్‌ లో సీటు లేకపోవడంతో అతడికి ఎయిర్‌ హోస్టస్ మరో సీటు ఇవ్వడంలో విఫలం అయ్యారు. దాంతో అతడు నానా రచ్చ చేయడం జరిగింది. ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసిన ఎయిర్‌ హోస్టస్‌ అతడి ప్రవర్తనపై సీరియస్ గానే ఫిర్యాదు ఇచ్చిందట.

దాంతో ప్రయాణికుడిపై ఎయిర్ లైన్స్‌ సంస్థ బ్యాన్‌ విధించినట్లుగా తెలుస్తోంది. తోటి ప్రయాణికుడిని అవమానించడంతో పాటు విమానంలో న్యూసెన్స్ చేశాడంటూ అతడిపై బ్యాన్ విధిస్తున్నట్లుగా ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ప్రకటించింది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us