హిందుత్వానికి మోడీ పునాది వేసాడు: అసదుద్దీన్ ఒవైసీ
Admin - August 5, 2020 / 12:33 PM IST

అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనడం పై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ హిందుత్వానికి పునాది వేశాడని తీవ్రమైన విమర్శలు కురిపించారు. దేశ ప్రధానికి ఏ ఒక్క మతంపై ప్రేమ ఉండకూడదని అన్నాడు. అలాగే ఒక మందిరం కానీ, ఒక మసీదు కానీ దేశానికి గొప్ప కాదు అని వ్యాఖ్యానించాడు. అయోధ్య రామ మందిరం వివాదంలో బీజేపీ మరియు సంఘ్పరివార్ సుప్రీంకోర్టుకు అసత్యా విషయాలు వెల్లడించాయని ఆరోపించారు.
ఈరోజు ప్రజాస్వామ్యం ఓడిపోయి హిందుత్వం గెలిచింది అని అన్నాడు. అలాగే ప్రధాని తన ప్రమాణ స్వీకారంలో చెప్పిన మాటలను ధిక్కరించి రామ మందిరానికి పునాది రాయి వేశారని అన్నాడు. లౌకిక దేశమైన ఇండియాలో ఇలాంటివి జరగడమేంటి అని ప్రశ్నించాడు. పునాది రాయి వేసిన అనంతరం భావోద్వేగానికి గురయ్యానని ప్రధాని తన ప్రసంగంలో చెప్పాడు. ఈ దేశ పౌరుడిగా, వారితో పాటు సమానంగా జీవిస్తున్న వాడిగా నేనూ కూడా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యానని అన్నాడు. ఎందుకంటే 450 ఏళ్ల నుండి ఆ ప్రాంతంలో బాబ్రీ మసీదు ఉందని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించాడు.