మళ్ళీ ఆసుపత్రిలో చేరిన హోమ్ మంత్రి అమిత్ షా
Admin - August 18, 2020 / 07:03 AM IST

కేంద్ర మంత్రి అమిత్ షా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అమిత్ షా ఆసుపత్రిలో చేరాడు. అయితే నిన్న రాత్రి 2 గంటల సమయాన ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీనితో ఆయనను వెంటనే భద్రతా సిబ్బంది సహాయంతో ఢిల్లీలోని ప్రముఖ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ రన్దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం అమిత్ షా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు సమాచారం ఇస్తున్నారు.
ఒకవైపు మరోసారి ఆయనకు కరోనా సోకిందనే తప్పుడు వార్తలను వైద్యులు ఖండించారు. అయితే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగానే ఆయన ఆస్పత్రిలో చేరారని స్పష్టం చేసారు. అయితే నాలుగు రోజుల నుండి అమిత్ షా అలసట, ఒంటి నొప్పులు తీవ్రంగా అయ్యాయి. దీనితో సిటీ స్కాన్ చేయించుకోగా పరీక్షా ఫలితాల్లో ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరాడు.