YS Sharmila : ముగింపు దశకు షర్మిల పాదయాత్ర.. ఇక పాలేరుపైనే మొత్తం ఫోకస్
NQ Staff - November 27, 2022 / 08:06 PM IST

YS Sharmila : వైయస్సార్టీపీ అధినేత్రి షర్మిల నిర్వహిస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3500 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. నర్సంపేట నియోజకవర్గం లోని నర్సంపేటలో వైయస్సార్ పైలాన్ ఆవిష్కరించారు.
వైయస్ షర్మిల పాద యాత్ర ద్వారా ఎంతో మందిని కలుసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు పార్టీ నాయకులు చెబుతున్నారు. పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమానికి వైయస్ విజయమ్మ హాజరయ్యారు.
పాదయాత్ర ముగింపు దశకు చేరుకున్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. 3725 కిలోమీటర్ల వద్ద తన యొక్క పాద యాత్రని ముగించబోతున్నట్లుగా షర్మిల పేర్కొన్నారు.
తన రికార్డును తానే తిరగ రాసుకొని పాద యాత్ర కు ముగింపు పలకాలని షర్మిల భావిస్తున్నారట, పాద యాత్ర తర్వాత పూర్తిగా ఫోకస్ పాలేరు పై పెట్టబోతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ చేయబోతున్నట్లుగా ఇప్పటికే షర్మిల అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు.
డిసెంబర్ 7 తర్వాత షర్మిల పూర్తిగా పాలేరు పై ఫోకస్ పెట్టి అక్కడ పార్టీ ఆఫీస్ కి శంకుస్థాపన చేయబోతున్నారట. ఎన్నికల వరకు పూర్తిగా అక్కడే మకాం వేసి ఎట్టి పరిస్థితుల్లో పాలేరు సీటు ను గెలుచుకునేందుకు షర్మిల ప్రయత్నించబోతున్నారని పార్టీ వర్గాల వారు అంటున్నారు.

After Pada Yatra Full Focus Going Paleru On YS Sharmila
పాదయాత్ర చేసి ఎంతో మందిని కలిసి ప్రజా మద్దతు దక్కించుకున్న వైయస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపిస్తారని నమ్మకాన్ని ఆ పార్టీ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.