ఇండియా బ్యాన్ చేసినందుకు పబ్ జి ఎంత నష్టపోయిందో తెలుసా..!

Admin - September 4, 2020 / 12:03 PM IST

ఇండియా బ్యాన్ చేసినందుకు పబ్ జి ఎంత నష్టపోయిందో తెలుసా..!

భారత్ లో భద్రతాపరమైన కారణాల వల్ల కొన్ని చైనా యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కొన్ని నెలల క్రితం టిక్ టాక్ తో సహా మరో 59 చైనా యాప్స్ ను నిషేధించింది. అలాగే తాజాగా పబ్ జీ తో సహా మరో 118 యాప్స్ ను నిషేధిస్తున్నట్టు భారత ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.
అయితే భారత్ లో పబ్ జి గేమ్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇప్పటికే చాలా మంది యువకులు పబ్ జి కి బానిస అయిన విషయం అందరికి తెలిసిందే.

అయితే భారత్ లో పబ్ జి ని నిషేధించడంతో చైనా ఎంత నష్టపోయిందో తెలిస్తే షాక్ ఇవ్వాల్సిందే. అయితే ఇప్పటి వరకు 14 బిలియన్ల డాలర్స్ అంటే లక్ష 2వేల కోట్ల వరకు మార్కెట్ వాల్యూ తగ్గింది. అయితే పబ్ జి మొబైల్ వర్షన్ ను చైనా టెన్సింట్ కొనుగోలు చేసింది. ఇక చైనా లోని అతిపెద్ద అతిపెద్ద కంపెనీ టెన్సింట్ కు భారీగా నష్టం వాటిల్లింది. అయితే భారత్ లో మొత్తం 17.5 మిలియన్ల మంది ఈ పబ్ జి యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నారు. ఇక ఇంత మొత్తంలో యూసర్లు ఉండడంతో ఒక్క సారిగా నిషేధించడంతో భారీగా నష్టపోయింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us