73 సంవత్సరాల తరువాత మొదటిసారి విద్యుత్ కాంతిని చూడనున్న 3 గ్రామాలు

Advertisement

లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఉన్న కుప్వార జిల్లాలో ఉన్న 3 గ్రామాలు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటి సారి కరెంట్ వెలుగులను చూడనుంది. దాదాపు 14000 మంది నివాసముంటున్న కెరన్, ముండియన్, పాత్రు గ్రామాలు త్వరలో విద్యుత్ సౌకర్యం పొందనున్నాయి. తరచు ఈ ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులు చేయడం వల్ల కరెంట్ సౌకర్యం ఏర్పాటు చేయలేకపోయారు.

కాశ్మీర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు 33kv ఎలక్ట్రిక్ లైన్స్ ను ఏర్పాటు చేశారు. కెరన్ నియంత్రణ రేఖకు 500మీటర్స్ దూరంలో ఉండటంతో 979 యుటిలిటీ పోల్స్ ను ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ కారణంగానే పనులు త్వరగా పూర్తి అయ్యాయని, ప్రజలు కూడా దీనికి సహకరించారని కాశ్మీర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి చేయాల్సిన పనులు కాబట్టి చాలా జాగ్రత్తగా చేశామని వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here