Kedarishwara Rao : 55 ఏళ్ల‌కు జాబ్ తెచ్చుకున్న వ్య‌క్తి స్టోరీని ట‌చ్ చేస్తున్న శివ నిర్వాణ‌..!

NQ Staff - July 13, 2022 / 03:40 PM IST

Kedarishwara Rao : 55 ఏళ్ల‌కు జాబ్ తెచ్చుకున్న వ్య‌క్తి స్టోరీని ట‌చ్ చేస్తున్న శివ నిర్వాణ‌..!

Kedarishwara Rao : కేద‌రీశ్వ‌ర‌రావు.. ఇటీవ‌ల ఈ పేరు చాలా హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కార‌ణం ఆయ‌న 55 ఏళ్లకు జాబ్ కొట్ట‌డం, 10 సంవ‌త్స‌రాలు కూడా ప‌ని చేయ‌కుండా రిటైర్ అవనున్న నేప‌థ్యంలో ఇత‌ని గురించి నెట్టింట తెగ చ‌ర్చ న‌డిచింది. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం, పెద్దసీది గ్రామానికి చెందిన కేదరీశ్వరరావు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశారు.

ఎమోష‌న‌ల్ స్టోరీ..

ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడే ఈయన 1998 డీఎస్సీ జాబితాలో ఉద్యోగం సంపాదించాడు. అయితే కొన్ని వివాదాల కారణంగా ఈ నోటిఫికేషన్ అప్పట్లో ఆగిపోయింది. అయితే ఇటీవ‌ల ప్రభుత్వం ఆ బ్యాచ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చింది. దీంతో 24 ఏళ్ల తరువాత కేదరీశ్వరరావుకు ఉద్యోగం వచ్చింది.

After 24 Years Kedarishwara Rao Reached The Goal

After 24 Years Kedarishwara Rao Reached The Goal

మొత్తం 4000 మంది ఉద్యో గాలు పొందినా కూడా కేదరీశ్వరరావు మాత్రం ఎంతో ప్రత్యేకం. టీచర్ ఉద్యోగమే పరమావ‌దిగా భావించిన కేదరీశ్వరావు అదే ఉద్యోగం కోసం జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నారు. ఉన్నత చదువు ఎమ్మెసీ బీఈడీ చేతిలో ఉన్నా ప్రయివేటు ఉద్యోగంలో స్థిరపడలేదు. ఇటు ప్రయివేటు జాబ్ రాక..మరోవైపు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక తీవ్ర నిరుత్సాహంలో మానసింక సంఘర్ణకి గురై స్వగ్రామానికే జీవితాన్ని పరిమితం చేసారు.

చివరికి ఓ బికారీలో మారిపోయిన కేద‌రీశ్వ‌ర‌రావు ఉన్నత కుటుంబంలో పుట్టినా కాలక్రమేణా ఆస్తులు కరిగి పోయాయి. దీంతో వారసత్వంగా వస్తోన్న బట్టల వ్యాపారాన్ని సైకిల్ పై కొనసాగిస్తూ జీవితాన్ని నడిపించాడు. ఉంటే తినడం..లేకపోతే పస్తుతో పడుకోవడం ఇలా 24 ఏళ్ల జీవితం సాగిపోయింది. తల్లి దూరమైంది. ప్రేమించిన ప్రియురాలు మరోకరి వశ‌మైంది. ఈ రెండు సంఘటనలు ఉద్యోగం కన్నా ఎక్కువగా బాధించాయి.

After 24 Years Kedarishwara Rao Reached The Goal

After 24 Years Kedarishwara Rao Reached The Goal

ఇలా ఆయ‌న జీవితంలో ఎన్నో విచిత్ర‌మైన సంఘ‌ట‌నలు ఉండ‌గా, ఇది మరో బీఈడీ చదివిన దర్శకుడ్ని కదిలిచింది. అది మరెవ‌రో కాదు, ‘నిన్ను కోరి’..’మజిలి’ సినిమాలతో స్టార్ మేకర్ గా మారిన శివ నిర్వాణ. కేదరీశ్వరావు జీవిత కథని వెండి తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందని అతని బయోపిక్ పై క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు స‌మాచారం. కేదరీశ్వరావు కథలో ఎంతో ఎమోషన్ ఉండటంతో శివ సినిమాగా రూపొందించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us