Major : అడివి శేష్ మేజర్ సినిమా రిలీజ్ వాయిదా?

Major : ప్రస్తుతం మహమ్మారితో అందరూ విలవిలలాడిపోతున్నారు. అన్ని వ్యాపారాలు మూత పడ్డాయి. జనాలు ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు. థియేటర్లు కూడా మూతపడిపోయాయి. కరోనా వలయంలో తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా చిక్కుకుపోయింది. ఇప్పటికే కరోనా మొదటి వేవ్ తో సినీ ఇండస్ట్రీకి తీవ్రమైన నష్టం వాటిల్లింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ రావడంతో.. సినీ ఇండస్ట్రీ మరోసారి కుదేల్ అయిపోయింది. ఇప్పటికే తెలుగు సినిమా షూటింగ్ లు అన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. అలాగే.. రిలీజ్ కావాల్సిన ఎన్నో సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని రిలీజ్ కోసం వేచి చూస్తున్నాయి.

adivi sesh major movie released postponed
adivi sesh major movie released postponed

పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ షూటింగ్ .పూర్తి చేసుకొని.. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా? అని ఎదురు చూస్తున్నాయి. అవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. టక్ జగదీశ్, లవ్ స్టోరీ, ఖిలాడీ, అఖండ, విరాట పర్వం, ఆచార్య లాంటి పెద్ద సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. అసలు.. ఎప్పుడు కరోనా సెకండ్ వేవ్ ముగుస్తుందో.. ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయో అనేది కూడా పెద్ద ప్రశ్నలాగనే మిగిలిపోయింది.

అయితే.. తాజాగా మరో పెద్ద ప్రాజెక్ట్ సినిమా విడుదల కూడా ఆగిపోయింది. అదే మేజర్ మూవీ. సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా మేజర్. అందుకే.. ఈ సినిమాకు అంత క్రేజ్ వచ్చింది. అందులోనూ ఇది పాన్ ఇండియా మూవీ. ముంబైలో పాక్ ఉగ్రవాదుల దాడిని బేస్ చేసుకొని వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాను జులై 2 న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావించారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయలేకపోతున్నామని.. సినిమా విడుదల తేదీని మరోసారి ప్రకటిస్తామని తెలిపారు.

ఇక.. ఈ సినిమాలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ముంబై దాడుల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈసినిమాకు శశికిరణ్ దర్శకత్వం వహించారు.