Yami Gautam Luxury Car Value : ఖరీదైన కారు కొన్న యామి గౌతమ్.. ధర ఎన్ని కోట్లో తెలుసా..?
NQ Staff - June 27, 2023 / 11:57 AM IST

Yami Gautam Luxury Car Value : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు వరుసగా లగ్జరీ కార్లు కొంటున్నారు. తమ రేంజ్ కు తగ్గట్టు కోట్ల విలువ చేసే కార్లను కొనేస్తున్నారు. రీఎంట్ గానే సూపర్ స్టార్ మహేశ్ బాబు లగ్జరీ కారును కొన్నారు. కోలీవుడ్ యాక్టర్ అయిన షమ్మూ కూడా తన డ్రీమ్ కారును రూ.4 కోట్లు పెట్టి కొనేసింది.
ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇదే బాట పట్టింది. ఆమె ఎవరో కాదు యామీ గౌతమ్. ‘విక్కీ డోనర్’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ లాంటి సినిమాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో కూడా కిరియర్ బాయ్ లక్యాణ్, నువ్విలా లాంఇ సినిమాలు చేసింది. అలాగే హిందీ, కన్నడ, పంజాబీ భాషల్లో కూడా ఆమె సినిమాలు చేసింది.
ఆమె దర్శకుడు ఆదిత్య ధర్ ను ప్రేమించి పెండ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. రూ.1.24 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును కొనేసింది ఈ భామ. ఇప్పటికే ఆమె గ్యారేజ్ లో ఆడి ఏ4, ఆడి క్యూ7 కార్స్ ఉన్నాయి. ఇది ఖరీదైన మూడో కార్.