Aditi Rao Hydari Comments On Tollywood Heroines : కమిట్ మెంట్లు ఇచ్చాక మళ్లీ అరవడం ఎందుకు… హీరోయిన్లపై అదితిరావు హైదరీ కామెంట్స్..!
NQ Staff - August 6, 2023 / 12:39 PM IST

Aditi Rao Hydari Comments On Tollywood Heroines :
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ట్యాలెంట్ ఉంటే అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఎంత ట్యాలెంట్ ఉన్నా సరే కాస్టింగ్ కౌచ్ అనేది పెనుభూతంలా మారిపోయింది. దాన్ని దాటుకుని ఛాన్సులు పడుతున్న వారు కొందరు మాత్రమే. చాలామంది దానిని ఫేస్ చేయలేక ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతున్న వారు కూడా ఉన్నారు.
అయితే మీటూ ఉద్యమం తర్వాత చాలామంది బయటకు వచ్చి తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ కూడా ఇలాగే ఓపెన్ అయింది. ఆమె ఎవరో కాదు అదితిరావు హైదరీ. ఆమె తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ వరుసగా మూవీలు చేస్తూనే ఉంది.
దాని వల్ల ప్రయోజనం ఉండదు..
ఇక ప్రస్తుతం ఆమె హీరో సిద్దార్థ్ తో డేటింగ్ లో ఉంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె కాస్టింగ్ కౌచ్ ప్రశ్న మీద స్పందించింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎవరినీ నిందించాల్సివన అవసరం లేదు. దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏదైనా సరే అమ్మాయిల బలహీనత మీదనే ఆధారపడి ఉంటుంది.
ఇష్ట పూర్వకంగా కమిట్ మెంట్లు ఇచ్చిన తర్వాత మళ్లీ దానిపై మాట్లాడటం అనవసరం. మనం బలహీనంగా ఉంటేనే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు. కాబట్టి ముందు మనల్ని మనం స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. కాబట్టి ఇలాంటి వాటికి ఎవరూ లొంగొద్దు అంటూ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.