Hanuman : ఆదిపురుష్‌ వర్సెస్‌ హనుమాన్‌.. సోషల్ మీడియా ట్రోల్స్‌

NQ Staff - November 22, 2022 / 09:33 AM IST

Hanuman : ఆదిపురుష్‌ వర్సెస్‌ హనుమాన్‌.. సోషల్ మీడియా ట్రోల్స్‌

Hanuman : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న హనుమాన్ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఇండియన్ సూపర్ హీరో సినిమా అంటూ చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో హనుమాన్ ఎలా ఉంటుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టీజర్ ఏమాత్రం నిరాశ పర్చకుండా అంచనాలు మరింతగా పెంచింది. కేవలం 15 కోట్ల లోపు బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించారు అంటే నమ్మశక్యంగా లేదు అంటూ హనుమాన్ టీజర్ చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ యొక్క టీజర్ గురించి చర్చ మొదలైంది. ఆదిపురుష్‌ మరియు బ్రహ్మాస్త్ర వంటి సినిమాలు వందల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసి నాసిరకం గ్రాఫిక్స్ తో చిన్న పిల్లల సినిమాల మాదిరిగా తయారు చేశారు.

కానీ అతి తక్కువ ఖర్చుతోనే హనుమాన్ సినిమా ను అద్భుతమైన విజువల్ వండర్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసుకు రాబోతున్నాడు అంటూ టీజర్ చూస్తుంటే అర్థమవుతుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆదిపురుష్‌ తో పోలిస్తే హనుమాన్ ఖచ్చితంగా బాగుంటుంది అంటూ చాలా మంది నమ్ముతున్నారు. హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో హీరోయిన్ గా నటించిన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. కీలక పాత్రలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటించడం ఈ సినిమా యొక్క మరో ప్రత్యేకత.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us