Adipurush : ‘ఆది‘లోనే హంసపాదు.. ప్రభాస్ ప్రాజెక్టుతో ఓం రౌత్ ఓ రేంజులో ఆడుకుంటున్నాడుగా !

NQ Staff - November 28, 2022 / 12:00 PM IST

Adipurush  : ‘ఆది‘లోనే హంసపాదు.. ప్రభాస్ ప్రాజెక్టుతో ఓం రౌత్ ఓ రేంజులో ఆడుకుంటున్నాడుగా !

Adipurush  : ప్రెస్టేజియస్ ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిన ఆదిపురుష్ పై ఆడియెన్సుకు ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ అవడం, ప్రభాస్ రాముడిగా నటిస్తుండడంతో నేషన్ వైడ్ గా ఈ మూవీపై ఇంట్రస్ట్ క్రియేటయింది. కానీ తీరా ప్రమోషన్స్ లో ఫస్ట్ ఫేజ్ గా రిలీజ్ చేసిన టీజర్ తేలిపోయింది.

టీజర్ రిలీజ్ చేయగానే వచ్చిన ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్సే పెదవి విరవడంతో టీజర్ ను థియేటర్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేసి ఇది మొబైల్స్ లో, ల్యాప్ టాపుల్లో చూసే మూవీ కాదంటూ చెప్పుకొచ్చారు. అయినా ఆడియెన్స్ పెద్దగా కన్విన్స్ అవ్వలేదు. ప్రొడ్యూసర్స్ కూడా టోటల్ అవుట్ పుట్ పై సాటిస్ ఫైగా లేరనేది ముందు నుంచి వినిపిస్తున్న మాటే.
దాంతో టెక్నికల్ గా ఇంకా చేంజెస్ చేయాల్సి రావడంతో ముందు సంక్రాంతి బరిలో నిలుస్తుందని టాక్ వచ్చినా తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు మేకర్స్.

కానీ లేటెస్టుగా వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే.. విజువల్ ఎఫెక్ట్స్ బాగా రావడం కోసం, మళ్లీ ట్రోలర్స్ నుంచి నెగిటివ్ రివ్యూస్ నుంచి ఎఫెక్టవ్వకుండా ఉండడానికి మరో రూ. 250 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలని డిసైడయ్యారట. ఇక ఈ వార్త కూడా వైరలవ్వడంతో 2024 సంక్రాంతికి థియేటర్లో అని టాక్ స్టార్టయిపోయింది సోషల్మీడియాలో. కానీ ఆ గాసిప్ వాస్తవం కాదట. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది జూన్ 16నే గ్రాండ్ రిలీజ్ చేయనున్నారట.

ప్రభాస్ ఫస్ట్ టైమ్ ఓ మైథలాజికల్ రిఫరెన్సులతో ఉన్న క్యారెక్టర్లో నటించడం, మొదటి సారి లైవ్ యాక్షన్ ఫార్మాట్లో సినిమా చేయడం.. ఇలాంటి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ వల్ల రెబల్ స్టార్ ఫ్యాన్సు కాకుండా అన్ని రకాల ఆడియెన్సులోనూ హైప్ పెరిగిందీ ప్రాజెక్టుపై.

కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా.. ఇన్ని ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్స్ ఉన్నా డైరెక్టర్ ఓం రౌత్ మాత్రం తన విజన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ లోపాల వల్ల ప్రభాస్ ప్రాజెక్టుతో మాత్రం డే అండ్ నైట్ మ్యాచ్ ఆడేస్తున్నాడు. సరే.. ఇంత కష్టపడి సినిమా చేసి, ఈ రేంజులో బజ్ ఉన్నప్పుడు.. సంత్రుప్తిగా లేని ఔట్ పుట్ తో సినిమా రిలీజ్ చేయడం కన్నా కాస్త లేటయినా ఇంకొన్ని మెరుగులు దిద్ది బెస్ట్ కంటెంట్ తోనే థియేటర్లో విడుదల చేద్దామన్న నిర్ణయానికొచ్చారు ప్రొడ్యూసర్స్.

నిజానికి బాహుబలి పార్ట్ టూ తర్వాత ప్రభాస్ కి తన క్రేజుకి, రేంజుకి తగ్గ భారీ బ్లాక్ బస్టర్ అయితే దక్కించుకోలేదు. గత చిత్రం రాధే శ్యామ్ అయితే రిలీజైన అన్ని భాషల్లోనూ డిజాస్టర్ టాక్ నే మూటగట్టుకుంది.

Adipurush Postponed Film For Visual Effects

Adipurush Postponed Film For Visual Effects

దాంతో ఆదిపురుష్ మూవీతో మరోసారి బాక్సాఫీస్ కా బాహుబలి అనిపించు కుందామని ఆశపడుతుంటే ఓం రౌత్ తీరు మాత్రం ఇలా ఉందంటూ అభిమానులు కాస్త సీరియసవుతున్నారు.

సరేలే.. అయితే లేటయింది.. కనీసం ఇప్పుడన్న ట్రోలర్స్ కి స్టఫ్ ఇవ్వకుండా, ఫ్యాన్స్ పరువు నిలబెట్టేలా ఎఫెక్ట్స్ తో ప్రాజెక్టుని ప్రాపర్ గా డవలప్ చేసి వాయిదా పడ్డ సమయానికయినా విడుదల చేస్తే అదే పదివేలు అనుకుంటున్నారు సిల్వర్ స్క్రీన్ బిల్లా ఫ్యాన్స్. అదే.. డై హార్డ్ ఫ్యాన్స్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us