“ఆదిపురుష్”లో సీత విషయంలో మరో ట్విస్ట్

Advertisement

టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే దింట్లో ఆదిపురుష్ సినిమా కూడా తీస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబందించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమా దేశంలోనే భారీ విజువల్ ఎఫెక్ట్స్ కలిగిన చిత్రంగా తెరకెక్కించేందుకు దర్శకుడు అనేక సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబందించిన కీలక పాత్ర అయిన సీత దేవి రోల్ కోసం అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక ఈ సీతాదేవి పాత్ర కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. దింట్లో ముఖ్యంగా కీర్తి సురేష్ మరియు కియారా అద్వానీల పేర్లు మొదట్లో ఎక్కువగా వినిపించాయి. ఇది ఇలా ఉంటె తాజాగా మరో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దాంట్లో బాలీవుడ్ అనుష్క శర్మ, టాలీవుడ్ అనుష్క ల పేర్లు ఇప్పుడు జోరుగా వినిపిస్తుంది. మరి ప్రభాస్ సరసన వీళ్ళిద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. ఒకవైపు ఫాన్స్ కూడా ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here