Adipurush Movie Disappointed Audience : గ్రేట్ : ‘ఆదిపురుష్’ మాట మీద నిలబడ్డాడు
NQ Staff - July 18, 2023 / 09:07 PM IST

Adipurush Movie Disappointed Audience :
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను రాముడిగా చూపిస్తూ ఓమ్ రౌత్ నిర్మించిన ఆదిపురుష్ సినిమా ను జూన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా విడుదల సమయంలో కచ్చితంగా ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ మాత్రం 50 రోజులు పూర్తి అయిన తర్వాతే అంటూ ప్రకటించారు.
సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయడానికి 50 రోజుల సమయం ఉంది కనుక ఖచ్చితంగా థియేటర్ లోనే అంతా చూడాలని ప్రభాస్ అభిమానులను మరియు సినీ ప్రేమికులను యూనిట్ సభ్యులు కోరిన విషయం తెల్సిందే. సినిమా ఓటీటీ కోసం వెయిట్ చేయవద్దు అంటూ యూనిట్ సభ్యులు పదే పదే కోరారు.
‘ఆదిపురుష్’ ఫలితం రివర్స్…
భారీ అంచనాల నడుమ వచ్చిన ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సత్తా ను చాటడం లో విఫలం అయింది. దాదాపుగా వెయ్యి కోట్లు వసూళ్లు నమోదు అవుతాయి అనుకుంటే కనీసం అందులో సగం అయినా వసూళ్లు నమోదు అయిన దాఖలాలు కనిపించడం లేదు అంటూ ఓటీటీ రెండు లేదా మూడు వారాల ముందుగానే స్ట్రీమింగ్ ఉండే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.

Adipurush Movie Disappointed Audience
ఆదిపురుష్ సినిమా నిరాశ పరిచిన నేపథ్యం లో ఓటీటీ ముందుగానే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకున్నారు. కానీ మేకర్స్ మొదటి నుండి చెబుతున్నట్లుగానే ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ 50 రోజులు పూర్తి అయిన తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ లో అమెజాన్.. నెట్‌ఫ్లిక్స్ జాయింట్ గా ఈ సినిమాను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.