Adipurush : ఆదిపురుష్‌ : ప్లీజ్ నాకు సెక్యూరిటీ ఇవ్వండి

NQ Staff - June 19, 2023 / 07:47 PM IST

Adipurush : ఆదిపురుష్‌ : ప్లీజ్ నాకు సెక్యూరిటీ ఇవ్వండి

Adipurush : యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రభాస్ అభిమానులతో పాటు అంతా కూడా నమ్మకం పెట్టుకున్నారు. కానీ తీవ్రంగా నిరాశ పర్చుతూ సినిమా ఫ్లాప్‌ టాక్ ను సొంతం చేసుకుంది.

అంతే కాకుండా సినిమా యొక్క పలు విషయాల గురించి విమర్శలు వస్తున్నాయి. రామాయణం ను మరియు రాముడిని అవమానించారు అంటూ హిందు సంఘాల వారు మరియు పలు సంఘాల వారు కోర్టును ఆశ్రయించారు. అంతే కాకుండా చిత్ర యూనిట్‌ సభ్యులు కనిపిస్తే చాలు కొట్టేయాలి అన్నట్లుగా రెడీగా ఉన్నారు.

తాజాగా ఆదిపురుష్ యొక్క డైలాగ్ రైటర్ మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని.. ఆదిపురుష్ డైలాగ్స్ రాసినందుకు తనను చంపేస్తానంటూ కొందరు బెదిరిస్తున్నారు అంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

తన ప్రాణాలకు ప్రమాదం ఉన్న కారణంగా భద్రత కల్పించాలంటూ విజ్ఞప్తి చేశాడు. అంతే కాకుండా తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న వారిపై మరియు తనను బెదిరిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని మనోజ్ ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us