Actress Vijayashanthi : ఎన్టీఆర్‌ నా ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పారు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..!

NQ Staff - May 28, 2023 / 09:35 AM IST

Actress Vijayashanthi : ఎన్టీఆర్‌ నా ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పారు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..!

Actress Vijayashanthi : సీనియర్ ఎన్టీఆర్‌ గురించి ఎంత చెప్పినా ఇంకా కొంచెం మిగిలే ఉంటుంది. ఎందుకంటే ఆయన మహోన్నతమైన స్థానం అలాంటిది. అయితే ఇప్పుడు ఆయన శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురించి సీనియర్ నటి విజయశాంతి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది.

ఇందులో ఎన్టీఆర్‌ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చిన్న ఉదాహరణతో వివరించింది. ఆమె ట్వీట్ లో ఇలా ఉంది.. 1990లో నేను చిరంజీవి గారితో ఏవీఎం స్టూడియోలో సినిమా చేస్తున్నా. అదే స్టూడియోలో డబ్బింగ్ థియేటర్ లో మహర్షి విశ్వామిత్ర సినిమాకు సీనియర్ ఎన్టీఆర్‌ డబ్బింగ్ చెబుతున్నారు.

ఆ విషయం తెలుసుకున్న నేను.. ఆయన్ను కలవడానికి డబ్బింగ్ థియేటర్ కు వెళ్లాను. అక్కడ అంతా చీకటి ఉండటంతో ఎన్టీఆర్ గారు నన్ను చూడకుండా వెళ్లిపోయారు. తర్వాత నేను వచ్చిన విషయం తెలుసుకున్నారు. దాంతో మరుసటి రోజు ఉదయమే చెన్నైలోని మా ఇంటికి వచ్చారు.

అప్పటికే నేను సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు ఫ్లైట్ లో బయలు దేరాను. నేను అమ్మాయిని చూసుకోలేదు. పొరపాటు జరిగింది బిడ్డకు తెలియజేయండి అంటూ శ్రీనివాస్ ప్రసాద్ గారికి చెప్పి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా నేను హైదరాబాద్ లో ఉన్న ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి సారీ చెప్పారు. ఆ ఘటనను నా జీవితంలో మర్చిపోలేను. సాటి కళాకారుల పట్ల ఆయనకు ఉన్న బాధ్యత అలాంటిది అంటూ ఎన్టీఆర్‌ ను గుర్తు చేసుకుంది విజయశాంతి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us