SUREKHA VANI: కూతురితో సురేఖా వాణి బ‌ర్త్ డే వేడుక‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఫొటోలు

Priyanka - April 29, 2021 / 11:35 AM IST

SUREKHA VANI: కూతురితో సురేఖా వాణి బ‌ర్త్ డే వేడుక‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఫొటోలు

SUREKHA VANI సురేఖా వాణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మొద‌ట్లో బుల్లితెర‌ పై సంద‌డి చేసిన సురేఖా ఆ త‌ర్వాత వెండితెర‌పై వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. దాదాపు అంద‌రు హీరోల చిత్రాల‌లో న‌టించింది సురేఖా. కొన్ని చిత్రాలు ఈమెకు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఇటీవ‌లి కాలంలో సినిమాలు కాస్త త‌గ్గించి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. కూతురితో షికార్స్‌కు వెళ్లడం, పార్టీలు, ప‌బ్స్‌, ఇలా లైఫ్‌ని హ్యాపీగా గ‌డుపుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న స‌ర‌దాలకు సంబంధించిన విశేషాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటుంది సురేఖా వాణి.

sureka

రీసెంట్‌గా సురేఖా వాణి త‌న 40వ బ‌ర్త్‌డే వేడుక జ‌రుపుకుంది. ఈ వేడుక‌లో కూతురితో పాటు ప‌లువురు స్నేహితులు సంద‌డి చేశారు. సురేఖా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బ‌ర్త్ డే వేడుక‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి. ఆమెకు నెటిజ‌న్స్ కూడా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నటి సురేఖ వాణి రెండో వివాహం చేసుకోనుందని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే . సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించాయి. దీంతో సురేఖ రెండో వివాహంపై జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో తన రెండో వివాహం పై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పింది. మరోసారి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చింది. సురేఖ భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us