Actress: ముంబైలో ఇల్లు కొనుగోలు చేసిన మ‌రో ముద్దుగుమ్మ‌

Actress: దేశ రాజ‌ధాని ముంబైలో సినిమా స్టార్స్ అంద‌రు విలాస‌వంత‌మైన ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు.ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది సెల‌బ్స్ బంగ్లాలు కొన్న విష‌యం తెలిసిందే. జాక్వెలిన్..ప్రియాంక చోప్రా బంగ్లా ద‌క్కించుకోగా, ర‌ష్మిక రీసెంట్‌గా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు కూడా రీసెంట్‌గా త‌మ టేస్ట్‌కి అనుగుణంగా నిర్మించుకున్న ఇంట్లోకి అడుగుపెట్టారు. త్వ‌ర‌లో స‌మంత కూడా ముంబైలో ఓ ఫ్లాట్ తీసుకుంటుంద‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ స‌న్నీలియోన్ కూడా ముంబైలో విలాస‌వంత‌మైన ఇల్లు కొనుగోలు చేసింది.

సన్నీలియోన్‌ పోర్న్‌స్టారే కావొచ్చు. ఆమె ఆత్మాభిమానానికి కొంచెం భంగం కలిగినా తట్టుకోలేదు. ఇతరులకు గౌరవ మర్యాదలు ఇస్తుంది. మనుషుల్ని ప్రేమిస్తుంది. బంధాలను కాపాడుకుంటుంది. ఇప్పుడు తనకున్న ముగ్గురు పిల్లలను కూడా అలాగే పెంచాలనుకుంటోంది. అప్పట్లో (2017) ఆడపిల్ల నిషాను దత్తత తీసుకున్నాం. దాంతో మా లోకమే మారిపోయింది.

ఆ తరువాత సరోగసీ (గర్భదానం) పద్ధతిలో ఇద్దరు మగ పిల్లలు (నోహ, యాషెర్‌) తోడయ్యారు. వాళ్లు ఇంటికి వచ్చిన రోజు నిషా ఆనందం చెప్పలేనంత! అంత సంబరపడుతుందని ఊహించలేదు. ఇప్పుడు దేవుడు మాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు మేము పిల్లల కోసం కలలు కనేవాళ్లం. ఆ కల నిజమైందిప్పుడు. నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా పిల్లలే కదా అంటూ స‌న్నీ లియోన్ చెబుతూ ఉంటుంది.

పిల్ల‌ల‌కు ఏ లోటు రాకుండా చూసుకుంటున్న స‌న్నీ లియోన్ మొన్న‌టి వ‌ర‌కు విదేశాల‌లో ఉండి ఇటీవ‌ల ముంబైకి తిరిగి వ‌చ్చింది. రీసెంట్‌గా కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసింది. కొత్తింట్లో డానియ‌ల్ వెబ‌ర్ చేతుల్లో స‌న్నీలియోన్ ను ఎత్తుకోగా..హ్యాపీమూడ్‌లో ఛిల్ అవుట్ అవుతోంది స‌న్నీలియోన్.

భారతదేశంలో మా జీవితంలో కొత్త అధ్యాయం మొద‌ల‌వుతుంది. నేను ఇక్క‌డ నిర్మించుకున్న ఇంటిని, జీవితాన్ని ప్రేమిస్తున్నాను. ఈ అందమైన ఇల్లు మా ముగ్గురు అందమైన పిల్లలతో చాలా అద్బుతంగా ఉంది అంటూ సంద‌డిగా మారిన కొత్తింటి ఫొటోల‌ను ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకుంది స‌న్నీ. ఈ ఫొటోలు చూసిన అభిమానులు స‌న్నీ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.