Actress Sheetal Patra Sensational Allegations Against Producer : ఆ నిర్మాత నా ప్రైవేట్ వీడియోలు లీక్ చేశాడు.. నటి సంచలన ఆరోపణలు..!
NQ Staff - August 3, 2023 / 09:44 AM IST

Actress Sheetal Patra Sensational Allegations Against Producer :
సినిమా ఇండస్ట్రీలో వేధింపుల కేసులు మనం చాలానే చూస్తూనే ఉన్నాం. ఎక్కువగా నటీమణులు ఇలాంటివి చేస్తుంటారు. సదరు హీరో లేదంటే నిర్మాత తమను వేధించారని.. ఇంకొందరు డైరెక్టర్ల మీద ఇలా రకరకాలుగా ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మరో భామ కూడా ఇలాంటి ఆరోపణలు చేసింది.
ఆమె ఎవరో కాదు ఒడిశాకు చెందిన ప్రముఖ నటి శీతల్ పాత్ర. ఆమె ఒడియాలో చాలా సినిమాలు చేసి ఫేమస్ అయింది. కాగా ఆమె తాజాగా ఓ నిర్మాత తనను దారుణంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అంతే కాకుండా తన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేశాడని ఆరోపించడం సంచలనం రేపుతోంది.
లైంగికంగా వేధిస్తున్నాడంటూ..

Actress Sheetal Patra Sensational Allegations Against Producer
ఎంటర్ టైన్ మెంట్ యజమాని అయిన దయానిధి ఎప్పటి నుంచో నా మీద కన్నేశాడు. అతను నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. తన మాట వినకపోతే నాకు ఛాన్సులు రాకుండా చేస్తానని బెదిరిస్తున్నాడు. అంతే కాకుండా గతంలో సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ కూడా వాపస్ ఇవ్వాలని బెదిరిస్తున్నాడు.
రీసెంట్ గా నా మీద భౌతిక దాడికి కూడా పాల్పపడ్డారని పోలీసులకు తెలిపింది. అంతే కాకుండా నేను కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా నా బట్టలు చింపేసి దారుణంగా వేధించాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. గత కొంతకాలంగా తాను నిర్మాతతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నానని.. దాన్ని ఆసరాగా తీసుకొని అతను నన్ను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.