Pawan Kalyan Said About Favorite Heroine : పవన్ కల్యాణ్‌ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఎవరూ ఊహించరు..!

NQ Staff - June 26, 2023 / 10:27 AM IST

Pawan Kalyan Said About Favorite Heroine : పవన్ కల్యాణ్‌ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఎవరూ ఊహించరు..!

Pawan Kalyan Said About Favorite Heroine : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అంటే సామాన్య ప్రజల నుంచి మొదలు కొని హీరోయిన్లు కూడా ఆయనకు అభిమానులే అవుతారు. ఆయన రేంజ్ అలాంటిది. సాధారణంగా అందరు హీరోలకు సామాన్య ప్రజల్లో అభిమానులు ఉంటారు. కానీ ఒక్క పవన్ కల్యాణ్‌ కు మాత్రమే సినీ సెలబ్రిటీల్లో కూడా అభిమానులు ఉంటారు.

అందుకే ఆయన ఇండస్ట్రీలో అగ్ర హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు పవన్ కల్యాణ్‌. అయితే హీరోయిన్లకు ఫేవరెట్ హీరో అయిన పవన్ కు ఏ హీరోయిన్ ఫేవరెట్ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఈ ప్రశ్నకు ఓ సారి సమాధానం ఇచ్చారు పవన్. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు అలనాటి నటి సావిత్రి ఫేవరెట్ హీరోయిన్ అని తెలిపారు. ఆమె నటన అంటే తనకు చాలా ఆసక్తిగా అనిపిస్తుందని వివరించారు పవన్. అప్పట్ల మహానటిగా సావిత్రికి ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Actress Savitri Pawan Kalyan Favorite Heroine

Actress Savitri Pawan Kalyan Favorite Heroine

ఆమె జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగిందో.. అన్నే ఇబ్బందులు పడింది. ఆమె జీవిత కథ ఆధారంగా మహానటి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించింది. అందుకే ఇప్పటి జనరేషన్ లో ఆమె మహానటిగా గుర్తింపు పొందింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us