సీనియర్ నటి ఇంట్లో విషాదం

Advertisement

ప్రముఖ సీనియర్ నటి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు పొందారు నటి శరణ్య. అయితే శరణ్య తండ్రి మలయాళ నటుడు ఆంటోని భాస్కర్ రాజ్ (95) గుండెపోటుతో మృతి చెందారు. చెన్నైలోని విరుగంబక్కమ్‌లోని శరణ్య నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నాం ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి చేసారు.

ఒకవైపు ఆంటోని మృతితో శరణ్య ఇంట్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. అలాగే ఆంటోని మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంటోని భాస్కర్ శ్రీలంకలో దర్మకుడిగా తన కెరీర్‌ను మొదలు పెట్టాడు. ఆంటోని మలయాళంలో పలువురు స్టార్ హీరోలతో కూడా సినిమాలు తెరకెక్కించారు. సుమారు 70కి పైగా చిత్రాలు ఆయన తెరకెక్కించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here