Actress Pragathi : డబ్బుల్లేక పిజ్జా షాప్ లో పని చేశా.. నటి ప్రగతి ఎమోషనల్..!
NQ Staff - June 8, 2023 / 02:26 PM IST

Actress Pragathi : సినిమా రంగంలో ఇప్పుడు మనకు స్టార్లుగా కనిపిస్తున్న వారంతా కూడా ఒకప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించిన వారు ఉంటారు. అందులో కొందరు మాత్రమే మంచి కుటుంబం నుంచి వచ్చిన వారు ఉంటారు. మిగతా వారంతా తినడానికి తిండి కూడా లేని స్థితి నుంచి వచ్చిన వారే అధికంగా ఉంటారు. నటి ప్రగతి కూడా అలాంటిదే.
ఇప్పుడు ఆమె నటిగా ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. అంతెందుకు ఒకప్పుడు ఆమె హీరోయిన్ గా కొన్ని సినిమాలు కూడా చేసింది. కానీ ఆమె బ్యాక్ గ్రౌండ్ మాత్రం చాలా దారుణం. ఎందుకంటే ఆమె కూడా చాలా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చింది. తాజాగా ఈ విషయాలను ఆమె పంచుకుంది.
నేను మొదట్లో మోడలింగ్ చేయాలని అనుకున్నాను. కానీ అందుకు నా దగ్గర డబ్బుల్లేవు. దాంతో పిజ్జా హాట్ లో కూడా పని చేశాను. అలా వచ్చిన డబ్బులతోనే మోడలింగ్ స్టార్ట్ చేశాను. నా లక్ కొద్ది నాకు హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని నేను కరెక్టుగా వినియోగించుకోలేకపోయాను.
కరెక్టుగా ఎదుగుతున్న సమయంలోనే నాకు పెండ్లి అయిపోయింది. దాంతో హీరోయిన్ గా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అదే నాకు పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. అటు సినీ కెరీర్, ఇటు వ్యక్తిగత జీవితం రెండూ కోల్పోయాను. భర్తకు దూరం అయ్యాను. ఇప్పుడు పిల్లలతో కలిసి ఉంటున్నాను. కానీ నటిగా ఇప్పుడు బాగానే ఉన్నాను అంటూ తెలిపింది.