శ్రీకాంత్ భార్య ఊహ మేనమామ ఎంత పెద్ద నటుడో తెలుసా..?

ఇప్పుడు సినిమా అవకాశాలు కావాలంటే టిక్ టాక్ లో ఒక వీడియో పెడితేనే, ఒక షార్ట్ ఫిలిం లో నటిస్తేనో, లేదంటే వెబ్ సిరీస్ చేసిన చాలు సూపర్ క్రేజ్ తో పాటు వరస ఆఫర్స్ కూడా వస్తాయి. కాని ఇదివరకటి రోజుల్లో సినిమా అవకాశం పొందటం అంత సులువు కాదు. నాటకాల్లో వేషాలు వేసి థియేటర్ ఆర్టిస్ట్ గా తమ ప్రతిభ చూపించుకుంటేనే ఏదైనా ఒక అవకాశం లభిస్తుంది. అంత చేసిన ఇంట్లో వాళ్లను ఒప్పించడం మహా కష్టం. సినిమా ఛాన్సులు రావాలంటే నటనతో పాటు మంచి బ్యాగ్ గ్రౌండ్ కూడా ఉండాలి. లేదంటే పాపులర్ నటీనటులతో పరిచయాలయిన ఉండాలి.

అయన కోడలిగా సినీరంగ ప్రవేశం

అయితే ఇవన్నీ కాకుండా తమ సొంత కాళ్లపై నిలబడే నటులు ఉన్నారు. అలాంటి వారిలో మొన్నటి తరం నటుడు పి.ఎల్.నారాయణ గారు వస్తారు. అప్పటి స్టార్ హీరోలయిన అందరితో అయన కలిసి పని చేసారు. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ 300 చిత్రాలకు పైగా పూర్తి చేసారు. ఇక ఈయన నటవారసురాలిగా వెండితెరకు పరిచయం అయ్యారు నటి ఊహ.

ooha

ఆమె చిత్రం తో కెరీర్ టర్న్

ఈమె శ్రీకాంత్ భార్యగానే అందరికి సుపరిచితం. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం సహాయం చేసింది మాత్రం పి.ఎల్.నారాయణ గారే. అయన ఇచ్చిన రిఫరెన్స్ తోనే ఊహ తన సినీ తెరంగేట్రం చేసింది. ఊహ అసలు పేరు శివరంజని. ఊహకు ‘ఆమె’ చిత్రం ద్వారా హిట్ దక్కింది. ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే శ్రీకాంత్ ని పెద్దలు పెళ్ళిచేసుకోవాలని సూచించగా ఆమె కూడా సరే అంది. అలా ఊహ తన సినీ ప్రయాణాన్ని ఒక దశాబ్దం పాటు కొనసాగించి శ్రీకాంత్ ఇంట్లో అడుగు పెట్టింది. ఇక శ్రీకాంత్ ఊహలకు ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు రోహిత్ హీరోగా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement